Friday, 25 May 2018

చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరం ; ఎస్ఐ శివకుమార్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (రెబ్బెన) ; వదంతులు నమ్మి ప్రజలు ఇబ్బందులకు గురికావద్దని,  చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరంమని రెబ్బెన ఎస్ఐ శివ కూమార్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని గ్రమాలలో అవగాహన కల్పించారు.    గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మేసేజ్ లు,వీడియోలు వస్తున్న సంగతి తెలిసిందేనని చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి  చంపేస్తున్నారంటూ వదంతులు వస్తున్నాయి అని  దీనితో భయంతో అనుమానం వచ్చిన మతిస్థితం లేని వారిని మాములు వ్యక్తులపై దాడులు చేస్తుండడంతో ప్రాణనష్టం సంభవిస్తోంది అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న మేసేజ్ లు, వీడియోలు ఎవరూ నమ్మవద్దని సూచించారు.రాష్ట్ర లో ఇప్పడి వరకు ఎక్కడ ఇలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా భయబ్రాంతులకు గురికావద్దని సూచించారు. అనుమానంతో చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవ్వరిని కొట్టరాదని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారాన్ని  తెలియచేయాలని అన్నారు.

No comments:

Post a Comment