Friday, 11 May 2018

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 11 ; పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం అని బెల్లం పల్లి ఏరియా జీఎం  రవిశంకర్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం  గోలేటిలోని కార్మిక వాడలలో  స్వచ్ఛ పక్వాడా  కార్యక్రమంలో సేవ సభ్యులు, యోగ సభ్యులు, క్రీడాకారులు, కార్మికులు, అధికారులు  పాల్గొని రోడ్లను శుభ్రపరిచారు. అనంతరం జీఎం  రవిశంకర్   మాట్లాడుతూ మినిస్ట్రీ అఫ్ కోల్ , గవర్నమెంట్ అఫ్ ఇండియా ఆదేశాలకనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన ఆరోగ్యాలు బాగుంటాయన్నారు. గత వరం రోజులనుండి మైన్స్, మరియు డిపార్ట్మెంట్లలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులలో, వారి కుటుంబ సభ్యులలో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం అని, కార్మికులందరూ భాగస్వాములు కావాలని  అన్నారు.  ఈ కార్యక్రమంలో డిజిఎం  పెర్సొన్నల్ కిరణ్, డిజిఎం సివిల్ ప్రసాద రావు, ఐ ఈ డి యోహాన్, ఫైనాన్స్ మేనేజర్ రవి కుమార్, డీపీయం  రాజేశ్వర్, సీనియర్ సేవ సభ్యులు సొల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ, సింగరేణి సేవ సంస్థ కో ఆర్డినేటర్ కుమారస్వామి, స్పోర్ట్స్ సూపర్ వైజర్  రమేష్ తదితర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment