కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 12 ; సింగరేణిలో పనిచేస్తున్న మైనింగ్ డిప్యూటీ మేనేజర్లకు పదోన్నతులు కల్పించాలని బెల్లంపల్లి ఏరియా మేనేజర్ కే రవిశంకర్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా మైనింగ్ డిప్యూటీమేనేజర్లు మాట్లాడుతూ మేనేజర్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన అధికారులకు తగిన పదోన్నతులను కల్పించాలని కోరారు. సింగరేణిలో డిప్యూటీ మేనేజర్లకు పదోన్నతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు . ఇతర బొగ్గు సంస్థలో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్లను పదోన్నతులు కల్పించగా సింగరేణిలో మాత్రం ఏళ్ల తరబడి ఒకే హోదాలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు కావున డిప్యూటీ మేనేజర్లకు ఇతర బొగ్గు కంపెనీలలో మరియు సింగరేణిలో ఇతర డిపార్టుమెంట్లలో కల్పించినట్లుగా పదోన్నతులు కల్పించాలని వినతిపత్రం సమర్పించారు ఈ వినతిపత్రం ఇచ్చిన వారిలో సునీల్ కుమార్, నారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment