కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే7 ; జిల్లా ఆబ్కారీ అధికారి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండడంలేదని తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ సోమవారం జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ కు వినతి పత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ రెక్కాడితే గని డొక్కాడని కల్లుగీత కార్మికులకు నూతన టి ఎఫ్ టి లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకొని నెలలు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకొనే నాధుడే లేదని అన్నారు. జిల్లా ఆబ్కారీ అధికారి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండకుండా ఆదిలాబాద్ నుంచి కేవలం చుట్టం చూపుగా కార్యాలయానికి వచ్చి పోతున్నారని అన్నారు. జిల్లా పాలనాధికారి వెంటనే స్పందించి తమ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసరి రమేష్ గౌడ్, చేవూరి సృజన గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment