కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 9 ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెనుకబడిన కులాల కు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి పథకాలకు రుణాలు పొందుటకు కేటగిరీ 1,2,3, కులాల వారీగా గ్రామా సభలు నిర్వహించి లబ్ది దారులను ఎంపిక చేసి ఈ నెల 25 లోపు అర్హులైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి మండల అభివృద్ధి అధికారి ద్వారా కార్యనిర్వహణ అధికారి , జిల్లా వెనుకబడిన తరగతులశాఖ , ఆసిఫాబాద్ వారికీ అందచేయాలని, అలాగే ఆన్లైన్ లో ఇంతకూ ముందు దరఖాస్తు చేసుకున్నవారు తమ యొక్క కుల, ఆదాయ, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ధ్రువ పత్రలను మండల అభివృద్ధి అధికారి ద్వారా కార్యాలయంలో అందచేయాలని. జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారి ఆదేశాలతో జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment