Tuesday, 15 May 2018

తెలంగాణ ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వం ; జెడ్పిటిసి బాపూరావు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 15 ; తెలంగాణ  ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రైతులందరికీ ఎకరానికి 4000/-వేలు చొప్పున చెక్కులను జారీ చేయడం సంతోషకరమని జడ్పిటిసి బాపురావు అన్నారు. మంగళవారం  రెబ్బెన: మండలంలోని గోలేటి గ్రామంలో రైతు బందు పథకంలో చెక్కులు పంపిణి కార్యక్రమంలో మాట్లాడారు.  రైతులందరికీ ఎకరానికి 4000/-వేలు చొప్పున చెక్కులను జారీ చేయడం.పంట పండించే రైతులకు పెట్టుబడి విషయం లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఆశతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బందు పథకాన్ని ప్రవేశపెట్టి వీటిని రైతులు పంట పెట్టుబడికోసం స్వద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రాబోయే రోజుల్లో రైతులకు పెద్ద పీట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన తహశీల్ధార్ సాయన్న,మండల వ్యవసాయ అధికారిని మంజుల,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,  గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్,ఎంపిటిసిలు  సురేందర్ రాజ్,మురళి బాయ్, రైతు కమిటీ ఛైర్మెన్ సుబ్బారావు మరియు గ్రామ రైతులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment