Sunday, 20 May 2018

బాటసారులకు అంబలి పంపిణి

.  
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 20 ; ఎండాకాలం సందర్బంగా ఎండ వేడిమికి ఉపశమనం కొరకు బాటసారులకు  బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఆద్వర్యం లో ఆదివారం రెబ్బెన మండలం  గోలేటి బస్టాండ్ లో  అంబలి పంపిణి కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా బెటర్ యూత్ సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ ఎండల కారణంగా ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మా వంతు గా అంబలి పంపిణి కార్యక్రమం  చేపట్టినట్లు  తెలిపారు. భవిష్యత్ లో బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ తరుపున  మరెన్నో ఉపయోగకరమైన మరియు  సేవా కార్యక్రమాలు చేపడాతం అని అన్నారు.ఈ కార్యక్రమము లో సేవా సంస్ట ఉపాధ్యక్షులు రాజశేఖర్,రవీందర్, ప్రధాన కార్యదర్శి, అజయ్, సహాయ కార్యదర్శి.విజయ్, తిరుపతి, కోశాధికారి,తిరుపతి,శేఖర్,అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment