కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 14 ; బిసి కార్పోరేషన్ రుణాలు మంజూరు కోసం ప్రత్యేకంగా రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ లో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. హజరు కావలసిన యంపి డివో. ఉన్నతాధికారులు హజరు కాకపోవడం, కేవలం పంచాయతీ కార్యదర్శి మాత్రమే హాజరు కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సభ్యులు నిరసన తెలిపారు. మండల తహసీల్దార్ సాయన్న ఉన్నాత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు కేసరి ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ సభలను నిభందనలమేరకు నిర్వహించడం లేదని అన్నారు. అధికారులు కేవలం అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భోగె ఉపేందర్, గోలేటి యంపిటిసి మద్దెల సురేందర్ రాజు, ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు దుర్గం రవి. పూదరి సాయిలు నేలపై కూర్చొని నిరసన తెలిపారు.
No comments:
Post a Comment