Wednesday, 30 May 2018

టాస్క్ ఫోర్స్ సంచలన దాడిలో అక్రమంగా కలిగి ఉన్న భారీ ఫైర్ వర్క్స్ నిల్వలు, కలప, గుట్కా మరియు మద్యం నిల్వ పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30; కౌటాల  టోంకిని మరియు కౌటాల మండల కేంద్రంలో అక్రమంగా  భారీ ఫైర్ వర్క్స్ నిల్వలు, కలప, గుట్కా మరియు మద్యం నిల్వలు ఉన్నాయనే  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  లు తనిఖీ చేయగా *సంజయ్ సర్కార్* యొక్క ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5,00,000/- విలువ చేసే అనుమతిలేని ఫైర్ వర్క్స్, 5,000/- విలువ చేసే గుట్కా, 3,000/- విలువ చేసే మద్యం మరియు 15 ఫీట్ల టేకు కలప స్వాధీనం చేసుకోవటం జరిగినది. తదుపరి అతని సోదరుడు *సుజిత్ సర్కార్* యొక్క కిరాణం షాపులో 3,000/- విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకోవడం జరిగినది. అనంతరం *కాసనగొట్టు శ్రీదర్* యొక్క శ్రీనిధి కిరాణం షాపులో సుమారు 2,000/- విలువ చేసే గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకొని వీటన్నింటిని తదుపరి విచారణ నిమిత్తం కౌటాల పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించరు.

No comments:

Post a Comment