కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 4 ; స్వచ్ఛభారత్ కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని మొదటగా బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా ప్రభుత్వం ఇంటింటికి మరుగు దొడ్లు కట్టుకోవడానికి ఇచ్చే పథకం ను ఉపయోగించుకోవాలని జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ సభ్యులు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి వెంకటి అడిషనల్ పి డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్ గ్రామపంచాయతిలోని దస్నాపూర్ లో ఉదయం నడక కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాని బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేయాలనీ అన్నారు. ప్రభుత్వం ఓ డి ఎఫ్ పథకం కింద కేటాయించిన 12000 రూపాయలతోమరుగుదొడ్లు కట్టించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వచ్ఛభారత్ బృందం సభ్యులు, ఉప సర్పంచి, ఐ కే పి సి సి లు, వి ఓ ఏ లు ,గ్రామ సంఘ సభ్యులు,మండల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment