కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 20 ; ఖైదీల జీవితాల్లోమార్పు తెచ్చి వారి కాళ్లపై వారు నిలబడేవిదంగా తర్ఫీదు ఇవ్వాలని అసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు సూపెరిండేంట్ పి రామకృష్ణ రెడ్డి అన్నారు. ఆదివారం మై నేషన్ జైలు ఉత్పత్తుల శాఖ వారి ఆధ్వర్యంలోఖైదీలు తయారు చేసినటువంటి చేతిరుమాలులను గోలేటి టౌన్ షిప్ లో జైలు ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతు ఖైదిలు తాయారు చేసే ఉత్పత్తులను ప్రజలందరు ఆదరించాలని కోరారు.ఖైదీలు తాయారు చేసిన ఉత్పత్తులను ఆదరించడం వల్ల వారిలో కస్టపడి పనిచేసుకునే మనస్తత్వం కలుగుతుంది అన్నారు.ఇలాంటి కార్యక్రమాలద్వారా ఖైదీలలో మార్పు తేవచ్చు అన్నారు.మేము కూడా జీవితములో నిలబడగలమనే భావన ఖైదీలకు కలుగుతుందని అయన అన్నారు. ఈ కార్యక్రమములో రెబ్బెన ఎసై శివకుమార్, జైల్ సిబ్బంది అబ్బాస్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment