Tuesday, 8 May 2018

ప్రభుత్వఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలి : జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 8 ; ప్రభుత్వ  ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని  జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు అన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుబ్బారాయుడు,
మరియు డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సీతారాం లు మంగళవారం సందర్శించారు.ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును గమనించారు.ఆసుపత్రి పరిధిలో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలకు చీరలను అందచేశారు. తదనంతరం ఆశ కార్యకర్తలతో సమావేశం  నిర్వహించారు.

No comments:

Post a Comment