Tuesday, 8 May 2018

టాస్క్ ఫోర్స్ దాడిలో నకిలీ పత్తి విత్తనాలు మరియు బెల్లం పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 8 ;      రెబ్బెన మండలంలోని  ఖైరిగూడ గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు మరియు  రెబ్బెనలో నల్ల బెల్లం అక్రమంగా అమ్ముతున్నారని  సమాచారం తో టాస్క్ ఫోర్స్ సి.ఐ. అల్లం రాంబాబు మంగళవారం దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు.   ఖైరుగూడలో   తనిఖీ చేయగా జాటోత్ గోవింద్  ఇంట్లో సుమారు 24,000/- విలువ చేసే 10 కేజీ ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగినది. తదనంతరం రెబ్బెన బస్ స్టాండ్ దగ్గర మెయిన్ రోడ్డు పక్కన గల దీపక్ అగర్వాల్ కు చెందిన  చందులాల్ కిరణం షాపులో 5 కేజీ ల నల్ల బెల్లం స్వాధీనం చేసుకొని వీటన్నింటిని తదుపరి విచారణ నిమిత్తం రెబ్బెన పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగిందన్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన  నిర్భయంగా తెలియ పరచవచ్చనీ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు ఈ దాడిలో ఎస్సై శివకుమార్, టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment