కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 5 ; దళిత గిరిజనుల మేధావుల మహాసభకు సంబందించిన గోడప్రతులను జిల్లా కొలవరి కార్యదర్శి ఎరుగటి సుధాకర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షకులు బండపిల్ల రాజన్న మాదిగ, జిల్లా ఇంచార్జి గడ్డల బానయ్య మాదిగలు శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ సీ ఎస్ టి లపై ఆ త్యాచార చట్టం అమలులో ఉన్నప్పుడే హత్యలు, వేధింపులు, హింసలు జరుగుతున్నాయని, ఉదాహరణకు చుండూరు, కారంచేడు ఘటనలలో దళితులూ హత్యకు గురైన నిందితులను నిర్దోషులుగా ప్రకటించారని, అసలు దోషులు ఎవరని ఇంతవరకు నిర్దారించలేదన్నారు. ఎస్ సీ ఎస్ టి అత్యాచార చట్టాన్ని సుప్రీమ్ కోర్ట్ సవరించడంద్వారా మరిన్ని వేధింపులు జరిగే అవకాశముందని , వారిలో మరింత అభద్రతా నెలకొంటుందన్నారు. కావున సుప్రీమ్ కోర్ట్ మార్చ్ 20న ఇచ్చినటువంటి తీర్పును వెంటనే రద్దు చేయాలనీ లేనియెడల ఎస్ సీ ఎస్ టి లు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తారని అన్నారు.ఆదివారం హైదరాబాద్ లో జరగనున్న మహాసభను ప్రజలు పెద్ద సంఖ్యా లో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలోమాజీ జడ్పీటీసీ దుర్గం సోమయ్య , బొంగు నర్సింగ రావు మాదిగ, గోగర్ల రాజేష్ మాదిగ, ఇప్ప శ్రీనివాస్ మాదిగ, ఇగురాపు భుజంగ రావు మాదిగ, ఇగు రపు శ్రీకాంత్ మాదిగ, ఆత్మారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment