Sunday, 13 May 2018

రైతు బందు పథకం రైతులకు ఎంతో ఆసరా ; ఎమ్మెల్యే కోవలక్ష్మి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 13 ; రైతు బంధు పథకం ద్వారా  రైతులకు పంపిణీ చేస్తున్న సొమ్ము వ్యవసాయానికి  ఎంతో ఆసరాగా ఉంటుందని,  ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్  ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. రెబ్బెన మండలంలోని నంబాల గ్రామంలో ఆదివారం  రైతు బంధు పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రైతులకు మొదటి పంటకు  ఎంతో  ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగారా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలైన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ లను ప్రారంభించిందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనిమ్ అన్నారు. ఈ కార్యక్రమంలోరెబ్బెన ఎం ఆర్ ఓ  సాయన్న, ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్, నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,  వ్యవసాయాధికారిని మంజుల, ఎంపీటీసీ  వనజ, వ్యవసాయ కమిటీ మండల అధ్యక్షులు బొర్కుటే  నాగయ్య, టిబిజికె ఎస్ నాయకులూ శ్రీనివాస రావు, సింగల్ విండో డైరెక్టర్ సత్యనారాయణ, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 









No comments:

Post a Comment