కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 12 ; రెబ్బెన మండలం లోని పాసిగామ్ గ్రామంలో శెనివారం రైతు బంధు చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ఆసిఫాబాద్ శ్రీనివాస్ రావు, మండల వ్యవసాయ అధికారిని మంజులలు రైతు బంధు చెక్కులు,కొత్త పట్టా పాసుపుస్తకాలు పంపిణి చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పంటల పెట్టుబడికి ముందస్తుగా ఇస్తున్న చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగాపూర్ సర్పంచ్ ముంజం రవిందర్, ఏఈఓ రాకేష్, ఎచ్ఈఓ రమేష్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment