కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 20 ; ఎలాంటి అనుమతులు లేకుండా రాంపూర్ గ్రామ శివారులో అక్రమంగా నిర్మిస్తున్న డాంబర్ కంపెనీ నిర్మాణ పనులు ఆపాలని రాంపూర్ గ్రామస్థులు కోరారు. . డాంబర్ కంపెనీ రాంపూర్ గ్రామానికి దగ్గర గా ఉండటం మూలాన గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది అన్నారు. డాంబర్ కంపెనీ నుండి వెలువడే కలుషుతమైన గాలి,దుమ్ము,దూళి చిన్నపిల్లలకు,ప్రజలకు అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది అన్నారు.కంపెనీ యాజమాన్యానికి గ్రామపంచాయితీ అనుమతి నిరాకరించిన కూడా వారు లెక్కచేయకుండా పనులను కొనసాగిస్తున్నారు అన్నారు.గ్రామ ప్రజలమంతా కలసి వెళ్లి కంపెనీ యాజమాన్యానికి డాంబర్ వల్ల కలిగే నష్టాల గురించి వివరించగా పగటి పూట పనులు అపి,రాత్రిపూట పనులు చేపడతాం అని అంటున్నారు అన్నారు.దీని పై ఎన్ని సార్లు కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడ డాంబర్ కంపెనీ వద్దు అన్న కూడా వారు మా గ్రామ ప్రజల మాటను పెడచెవిన పెడుతు,గ్రమపంచాయితి అనుమతి లేకున్నా పనులను కొనసాగిస్తున్నారని ఇప్పడికైనా అధికారులు స్పందించి డాంబర్ కంపెనీ నుండి రాంపూర్ గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిని కాపాడాలని గ్రామస్థులు చాపిడి యాదవ్,డోంగ్రి పోచయ్య,చాపిడి ప్రభాకర్,చాపిడి సోమయ్య,డోంగ్రి గజానంద్,చాపిడి జగన్నాద్,చాపిడి ధర్మయ్య,డోంగ్రి తుకారాం,చునార్కర్ ధర్మయ్య,చునార్కర్ లింగయ్య,దశమికి శెంకరయ్య,డోంగ్రి ఆనందరావు,చల్లూరి దేవాజి,దుర్గం బాపు,దుర్గం హరిలాల్ తదితరులు కోరారు.
No comments:
Post a Comment