Tuesday, 29 May 2018

వేసవి సెలవులు జూన్ 12 వరకు పొడిగించాలి.

రాష్ట్రంలో  ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, పిల్లలు బయటికి వచ్చే పరిస్థితి లేదని ఏ  ఐ ఎస్  ఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు.   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ వేడుకల్లో విద్యార్థులు సైతం పాల్గొనాలనే ఉద్దేశ్యంతో 2018-19 విద్యా సంవత్సరాన్ని జూన్ 1 వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించిందని అన్నారు. గతంలో జూన్ 12 వ తేదీన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేదని, అప్పటి వరకు రుతుపవనాలు వచ్చి వాతావరణం చల్లబడేదని, కానీ ఈ సంవత్సరం ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా వున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులు జూన్ 12 వరకు పొడిగించాలని కోరారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందుబాటులో ఉన్న విద్యార్థులతో వేడుకలు జరుపుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు.

No comments:

Post a Comment