Tuesday, 15 May 2018

డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు తేదీని పొడిగించాలి ; ఏ ఐ ఎస్ ఎఫ్ డిమాండ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 15 ; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  డిగ్రీ ప్రవేశాలకు చేపడుతున్న  దరఖాస్తు తేదీని పొడిగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున గోలేటి లోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ ఆన్ లైన్ సర్వీస్ తెలంగాణ డి ఓ ఎస్ టి  కు దరఖాస్తు చేసుకోవాలంటే ముందే కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అవసరం రావడం వలన కొందరి విద్యార్థులకు అవి అందుబాటులో లేకపోవడం, రెవెన్యూ అధికారులు చెక్కులు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేయడంలో తీరిక లేక ఉండడం వలన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందడంలో   తీవ్ర జాప్యం జరుగుతోంది అని అన్నారు. అదే విధంగా ఆధార్ కార్థులకు చరవాని నెంబర్ లింక్ వంటి అంతర్జాలా సమస్యలు తలెత్తడం ఆధార్ క్రమబద్ధీకరణకు చాల రోజుల సమయం పడుతుందని, కానీడి ఓ ఎస్ టి  దరఖాస్తు కు ఈ నెల 26వ తేదీ చివరి తేదీ వరకు మాత్రమే ఉందని, దరఖాస్తు తేదీని వెంటనే పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటివరకు కేవలం 20 శాతం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఇంకా చాలా మంది విద్యార్థులు అనేక సమస్యలు ఉండడం వలన,  సమయం తక్కువ ఉన్నందున  డిగ్రీ ఆన్ లైన్ దరఖాస్తు తేదీని ఖచ్చితంగా పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్, మండల అధ్యక్షులు మలిశెట్టి మహిపాల్, గోలేటి పట్టణ అధ్యక్షులు జాడి సాయికుమార్, నాయకులు జెటంగుల సంజయ్ కుమార్, నవీన్, శివసాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment