Friday, 25 May 2018

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (రెబ్బెన) ; తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా లో ఉన్న మహిళలకు, చిన్నారులకు ఆటల  పోటీలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి ఇంచార్జి జీఎం కొండయ్య శుక్రవారం  తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 27న బెల్లంపల్లి  టి సి ఓ క్లబ్ లో సాయంత్రం 4గంటల నుండి 6 గంటల వరకు, 28న మాదారం కమ్యూనిటీ హాల్ లో మరియు  29న గోలేటి స్కూల్ లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలవరకు నిర్వహించబడునని తెలిపారు. పోటీలలో గెలుపొందినవారికి జూన్ 2 న సాయంత్రం జరిగే  తెలంగాణ ఆవిర్భావ వేడుక సభలో జీఎం కే రవిశంకర్,సేవ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ రవిశంకర్ చేతుల మీదుగా బహుమతుల  ప్రదానం జరుగుతుందని తెలిపారు.

No comments:

Post a Comment