Thursday, 3 May 2018

భూ వివాదం పై తప్పించుకోవడానికి కాంగ్రెస్ నాయకులపై అబాండాలు సరి కాదు

భూ వివాదం పై తప్పించుకోవడానికి కాంగ్రెస్ నాయకులపై అబాండాలు సరి కాదు  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 3 ;  ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించడంతో భూ వివాదం పై తప్పును తప్పించుకోవడానికి కాంగ్రెస్ నాయకులపై అబాండాలు మోపడం తెలివి తక్కువ పని అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముంజం రవీందర్, ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు లావుడ్యా రమేష్ లు విమర్శించారు. గురువారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో వారు  మాట్లాడుతు  మండలానికి చెందిన కొంత మంది వ్యక్తులు రెబ్బెన శివారులోని 309/4 సర్వే నంబర్ భూ వివాదంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే కేసులు పెట్టించారని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూ దందాలో ప్రమేయం ఉన్న వ్యక్తులు వారి స్వప్రయోజనాల కోసం అత్యాశతో కనీస అవగాహన లేకుండా కేవలం వారి స్వార్థం కోసం వారి తప్పుడు పనులను కప్పి పుచ్చుకోవడానికి  కాంగ్రెస్ పార్టీ నాయకుల పై నెట్టివేసి చేతులను దులుపుకొని తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి కోట్ల రూపాలు దోచుకున్నారన్నారు. భూదందాపై పత్రికల్లో కథనాలు రావడంతో దానికి అనుగుణంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని. ఈ విషయాన్నీ తప్పుడు కేసులని.కాంగ్రెస్ వారు చేపిస్తున్నారని వ్యాఖ్యానించడం పత్రికలను, పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ అధికారులను అవమానపర్చడమేనన్నారు.2014లో హైకోర్టు మొగిలి కనకయ్యకు 309/4 సర్వే నెంబర్ లో గల భూమిని కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఎన్ఓసి అనుమతి ఇచ్చిందని దాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి కోట్లు దండుకున్నారని అన్నారు. సీనియర్ తెరాస నాయకులమని చెప్పుకొని పబ్బం గడిపే వారు భూదందాలు, కబ్జాలను చేసిన వాటిని కప్పి పుచ్చుకునేందుకె అధికార తెరాస పార్టీలో చేరిన విషయం అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను విమర్శిస్తున్న నాయకులు గతంలో ఏ పార్టీ  మూలంగా రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారో  ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నంబాల ఎంపిటిసి కొవ్వూరి శ్రీనివాస్, సింగిల్ విండో  చైర్మన్ గాజుల రవీందర్ లు  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment