కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 12 ; విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది . రెబ్బెన మండలంలోని ఖైర్ కూడా గ్రామానికి చెందిన మేడి భీమేష్ అనే యువకుడు శనివారం విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయాడు .రెబ్బన ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం భీమేష్ మధ్యాహ్నం సమయంలో కూలర్ బిగించే క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్ను పట్టుకున్నాడు అదే సమయంలో సర్వీస్ వైర్ తో పాటు ఉండే జయ వైరు గుండా విద్యుత్ సరఫరా అవడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు .కాగా మృతుడికి భార్య శరణ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . ఈ మేరకు విద్యుత్ కాంట్రాక్టరు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
No comments:
Post a Comment