Tuesday, 29 May 2018

బదిలీపై వెళ్తున్న ఎస్ ఓ టు జియం ను సన్మానించిన అధికారులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 29; రెబ్బెన ; బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి  కార్యాలయంలో  ఎస్ ఓ టు జియం గా విధులు నిర్వహించిన ఎం శ్రీనివాసరావు బదిలీపై  శ్రీరాంపూర్ ఏరియా ఆర్ కె- 5 గ్రూప్ ఏజంట్ గా వెళ్తున్న   సందర్బంగా మంగళవారం జెనరల్ మేనేజర్ కార్యాలయం లో జియం రవి శెంకర్ మరియు అన్ని  గనుల డిపార్ట్మెంట్ల అధిపతులు వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జియం రవి శెంకర్ మాట్లాడుతు తన విది నిర్వహణలో కంపెనీ శ్రేయస్సుకై  పని చేసి బదిలీపై వెళ్తున్న ఎస్ ఓటు జియం ఎం శ్రీనివాస్   పని చేసిన  తక్కువ కాలంలోనే అందరి అదరాభిమానాలు  పొందిన   అభినందనీయుడని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు కె కొండయ్య,చింతల శ్రీనివాస్,జి మోహన్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ రామారావు,ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్,డిజియం సివిల్ ప్రసాద్ రావు,డిజియం కమలాకర్ భూషణ్,డివైసీఎంఓ అశోక్ కుమార్,ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి,డివై పియం రాజేశ్వర్,విజయ్ సింగ్,రమేష్ ,జలపతి, మరియు అన్ని గనుల డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment