కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 11 ; రైతుల సంక్షేమమే ప్రభుత్వ ఆశయం అని ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్ అన్నారు. రెబ్బెన మండలం రాళ్లపేట గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ కామనభాయ్ ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, వ్యవసాయాధికారిని మంజుల, రెవిన్యూ సిబ్బందితో కలసి ప్రభుత్వం రైతు బందు పథకం ద్వారా అందిస్తున్న వ్యవసాయ పెట్టుబడి చెక్కులను మరియు నూతన పట్టా పాస్ పుస్తకాల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా రైతుల వ్యవసాయ ఖర్చులను ప్రభుత్వమే అందించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ రూపొందించిన రైతుబంధు పథకం అని, ఈ పథకంలో సంవత్సరానికి రెండుపంటలకు పంటకు 4000 చొప్పున 8000 రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో బొర్కుటే నాగయ్య, వి ఆర్ ఓ ప్రేమదాస్, AEO -రాకేష్, HEO -రమేష్ , రైతు సమన్యయ సమీతి కో ఆర్డినేటర్- భోర్కుటే నాగయ్య, రాళ్ల పేట గ్రామ కోఆర్డినేటర్-అజ్మేర శంకర్, రాళ్లపేట గ్రామ vtda ప్రెసిడెంట్- అజ్మేర మురళి దర్,vroలు - వాసుదేవ్, మల్లేష్ ,ASI-రాజయ్య, నాయకులు నానాజీ గ్రామ రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment