Tuesday, 15 May 2018

ప్రియుడితో భర్తను చంపిన భార్య


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 15 ; రెబ్బెన మండలములో అక్రమ సంభందముతో ఓ వ్యక్తిని  గొంతు పిసికి ఉరి వేసి చంపినా సంఘటన సంచంలనం సృష్టించింది.  .ఆసిఫాబాద్ సి ఐ బాలాజీ వార ప్రసాద్ మంగళ వారం  తెలిపిన వివరాల ప్రకారం   దుర్గం నరసయ్య (35) ను అతని భార్య జ్యోతి , అదే గ్రామానికి  ప్రియుడు శ్రీనివాస్తో కలిసి సోమవారం రాత్రి గొంతు పిసికి  చంపినట్లు తెలిపారు. నర్సయ్య   జ్యోతిలు గత కొన్ని సంవత్సరాలగా వివాహం  చేసుకుని భార్యాభర్తలుగా జీవనము  సంతోషంగా కొనసాగిస్తున్నారు.  కొంతకాలంగా అదే గ్రామానికి  శ్రీనివాస్ అనే ప్రియుడి తో అక్రమ సంబంధం  ఏర్పర్చుకున్నాక్రమంలో   విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలిపారు.  సోమవారం రాత్రి మృతుడి భార్య  జ్యోతి ప్రియుడు  శ్రీనివాస్ తో  కలిసి గొంతు పిసికి   దూలానికి ఉరి  వేశారని,  ఉరివేసుకుని చనిపోయినట్లు నాటకమాడి 108 ఆంబులెన్సు లో   ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పేర్కొన్నట్లు,  విచారణలో దుర్గం నరసయ్యను గొంతు పిసికి చంపినట్లు తేలిందని అన్నారు. మృతుడికి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఉన్నారు.  ఈ మేరకు  ఎస్ ఐ శివ  కుమార్ కేసు నమోదు చేస్తుకున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment