Sunday, 6 May 2018

కారు ప్రమాదంలో చిన్నారి మృతి


రెబ్బెన మండలం తక్కళ్లపల్లి రోడ్ సమీపంలో ఆదివారం కారు టిఎస్02ఈవి 3141 మితి మీరిన వేగంతో అదుపు తప్పి  బోల్తా పడటంతో  కారు అద్దాలు పగిలి బయటపడటంతో   చిన్నారి  శాశ్విత (8) కు  తలకు తీవ్ర గాయాలు కావడం తో చికిత్స నిమిత్తము బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పటల్ కి తరలించగా మృతి చెందినట్లు  ఎస్సై శివకుమార్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం వీరు కరీంనగర్ జిల్లా జమ్మికుంట నివాసులని షిరిడి దైవదర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కారు మితిమీరిన వేగంతో వెళ్లడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొని బోల్తాపడినట్టు భావించారు. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న  పలువురికి గాయలు ఐన వారిని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగ చిన్నారి శాశ్విత మృతి చెందినట్లు పేర్కొన్నారు.ఈ కారులో చిన్నారి తల్లిదండ్రలు,అమ్మమ్మ తాతయ్యలు మరియు వారి మామయ్య ఉన్నట్లు తెలిపారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments:

Post a Comment