కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 17 ;.కర్ణాటకలో బిజెపి గెలుపునకు వ్యతిరేకంగా ఇతర పార్టీ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆఖరకు వారు మట్టి కరవడం జరిగిందని.జపాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోనగిరి సతీష్ అన్నారు. గురువారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతు కాంగ్రెస్ ముక్త భారతకి నిదర్శనమే కర్ణాటకలో బిజెపి విజయం అని కాంగ్రెస్ దేశానికి క్యాన్సర్ లాంటి రోగం దాన్ని కుక్కటి వేళ్లతో పెకిలించడమే మోదీ ఆశయం అన్నారు.దానికి తోడుగా కర్ణాటక ప్రజలు అందరూ ముక్తకంఠంతో అతి పెద్ద మెజార్టీతో కర్నాటకలో భాజపాను గెలిపించి తమవంతు ధర్మాన్ని చాటుకున్నారు.బిజెపి గెలుపే ఇతర రాష్ట్రాల్లో గెలుపునకు నాంది అని అన్నారు. కార్యకర్తలు,జాతీయఅధ్యక్షుడు అమితాషా మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కఠోర దీక్ష, శ్రమ దేశంలోని ప్రజల కోసం అభివృద్ధి పథకాల విజయం అని అన్నారు. అదేవిధంగా రాబోయే 2019 సంవత్సర ఎన్నికల్లో మరోసారి దేశవ్యాప్తంగా బిజెపి విజయ డంకా మోగిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కేసరి ఆంజనేయులుగౌడ్, చర్ల మురళి, బిజెపి మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, బిజెవైయం మండల అధ్యక్షులు ఇగురపూ సంజివ్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment