Friday, 11 May 2018

ప్రభుత్వ పథకాలపై కళాకారులచే అవగాహన కార్యక్రమం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 11 ; ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా కళాకారులచే కళాజాత ప్రదర్శన శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో  నిర్వహించారు. ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మొదలగు పథకాల గురించి పాటల రూపంలో ప్రజలకు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాజాత టీం లీడర్ కొప్పర్తి సురేందర్, గుడిసెల బాపు, తిరుపతి, ఇర్ఫాన్ హుస్సేన్, సమ్మయ్య, కృష్ణ, సంధ్య, పాల్గొన్నారు.

No comments:

Post a Comment