Monday, 14 May 2018

బిసి కార్పొరేషన్ రుణాల పేరుతో మోసం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 14 ; కార్పొరేషన్ రుణాల పేరుతో నిరుద్యోగ యువతి యువకులను మోసం చేస్తున్నరని రెబ్బెన యువజన కాంగ్రెస్ నాయకులు  వస్రం  నాయక్  అన్నారు. సోమవారం రెబ్బెన  మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోమాట్లాడారు.   బిసి    బిసి కార్పొరేషన్ రుణాలపై మాట్లాడుతు 2017-2018 సంవత్సరానికి గాను నిరుద్యోగ యువతీ యువకులకు బిసి కార్పొరేషన్ రుణాలను అందిస్తామని దరఖాస్తులను స్వీకరించి స్థానిక బ్యాంకు మేనేజర్ మరియు ఎంపిడిఓలు  ఇంటర్వూలు  చేపట్టకుండానే  స్థానిక గ్రామ  పంచాయితీ సెక్రటరీ  దరఖాస్తు  పత్రాలను పరీక్షించి లబ్ధిదారుల పత్రాలను తిరిగి లబ్దిదారులకు అందించి వెళ్లి బ్యాంకు అధికారితో సంతకం చేపించి ఎంపిడిఓ కార్యాలయం లో అందజేయమనడంలో బిసి కార్పొరేషన్ రుణాల్లో  అవకతవకలు ఎంతగా జరగబోతున్నాయో అని తెలుస్తుంది అన్నారు. అర్హులైన  లబ్దిదారులు  నిరుద్యోగ యువకులు ఈ పరిణామాల వల్ల నిరుత్సాహానికి గురవుతున్నారని .ఇప్పడికైనా సంబంధిత అధికారులు రుణాలపై  ఎలాంటి అవకతవకలు జరగకుండా అర్హులకు  రుణాలు అందేవిదంగా చూడాలని అలాగే  2015-2016 సంబందించిన దరఖాస్తులను స్వీకరించిన ప్రభుతం ఇప్పటి  వరకు రుణాలను మంజూరు చేయడం లేదన్నారు.కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యువకుల నుండి దరఖాస్తులను స్వీకరించి యువతతో ప్రభుత్వం పరిహాసాలు ఆడుతుందని ఘాటుగా  విమర్శించారు.ముందు ముందు తెలంగాణ యువత అన్ని గమనిస్తుంది అని రాబోయే ఎన్నికల్లో యువత  తగిన బుద్ది చెప్తుందని అన్నారు.అంతే కాకుండా రైతు బందు పథకం భూస్వాములకు మాత్రమే ఎకరానికి 4 వేలు ఇస్తూ కౌలు రైతులకు ఎటువంటి ప్రోత్సహకాన్ని గాని,గిట్టు బాటు ధర కానీ రాకపోవడం తో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.ఇప్పటికైనా కౌలు రైతులకు న్యాయం చేసే విదంగా చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో సంతోష్,శేఖర్,రంజిత్,భాస్కర్,కాంతారావు,గొండయ్య తదితరులు పాల్గొన్నారు.                             

No comments:

Post a Comment