Friday, 25 May 2018

విద్యతో పాటు క్రీడలలో రాణించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (రెబ్బెన) ; విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని బెల్లంపల్లి ఏరియా  సింగరేణి ఇంచార్జి జీఎం  కొండయ్య అన్నారు. శుక్రవారం రెబ్బెనమండలం గోలేటి  జీఎం  కార్యాలయంలో శనివారంరాష్ట్ర స్థాయి జూనియర్స్ ,సబ్ జూనియర్స్ సిద్ధిపేట మినీ స్టేడియం లో జరిగే స్విమ్మింగ్ పోటీలలో పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించి మాట్లాడారు. ఈ పోటీలలో మంచి ప్రతిభచూపించి గోలేటి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ కిరణ్,డి వై పీఎం రాజేశ్వర్, టీజీబీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment