Friday, 18 May 2018

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ; ఎమ్మెల్యే కోవాలక్ష్మి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెనమే 18 ;  గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమాలతో తెలంగాణ ప్రభుత్వం రైతులను ఎంతో ఆదుకుంటూ రైతు బంధు పథకం కింద చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని ఖైరిగాం,రెబ్బెన,పులికుంట,గంగాపూర్ గ్రామాల్లో రైతు బందు పథకం చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. రెబ్బెన అతిథి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు  రైతుల పంట పెట్టుబడి కోసం కొమురంభీం జిల్లాకు 125 కోట్ల రూపాయలు విడుదల చేసి రైతు బందు పథకాన్ని  గత ఎనిమిది రోజుల నుండి ప్రతి గ్రామాన రైతులకు చెక్కులతో పాటు పట్టా పాసుపుస్తకాలు పంపిణి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. .ఉమ్మడి రాష్టంలో గత ప్రభుత్వాలు రైతులను ఏ రకంగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కరెంటు కష్టాలతో,సాగునీటితో రైతులు ఎంతగానో ఇబ్బందిపడ్డారు అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక మిషన్ కాకతీయ ద్వారా రైతులకు సాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు తొలగిపోయాయి అన్నారు.రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రైతు బందు పథకం ద్వారా చెక్కుల పంపిణి చేస్తుంటే ఇతర పార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రజా చైతన్య బస్సు యాత్ర పేరుతో ప్రజల వద్ద మోసపూరిత ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర  ప్రజలకు ఏ ప్రభుత్వాలు మంచి చేసాయి  అన్న సంగతి ప్రజలకు తెలుసన్నారు.పంటల పెట్టుబడికి ఒక్క ఎకరానికి రెండు పంటలకు 8 వేలు ఒక్క  సంవత్సరం మాత్రమే ఇచ్చి మరచిపోయే పథకం కాదని తెరాస ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు రైతు బంధు పథకం అండగా ఉంటుందన్నారు.  అదేవిదంగా రెబ్బెన మండలంలో సుమారు 7 కోట్ల వ్యయంతో అంతర్గత రహదారుల అభివృద్ధి  చేపట్టామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో ప్రయోజక పథకాలను ప్రెవేశపెట్టారని అందులో,కల్యాణ లక్ష్మి, షాదిముబారక్, గొర్రెల పంపిణి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛను,దళితులకు మూడెకరాల భూమి వాటితో పాటు దేశంలోని ఏ రాష్టంలో చేపట్టని మహోన్నత కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు బందు పథకం ప్రవేశ పెట్టి రైతు ప్రభుత్వం గా రైతులకు అండగా ఉంటుందన్నారు. .అన్నదాతను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి రైతుల కండ్లల్లో ఆనందం చూస్తున్నారు అన్నారు .పంటల సాగుకు రైతులు అప్పులు చేయకుండా ఉండేందుకు రైతు బందు పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజ్మెర బాబు రావు, ఎంపిపి కర్నాతం సంజీవ్,రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, వైస్ ఎంపిపి గోడిసెల రేణుక, రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, ఏడి శ్రీనివాస్,మండల వ్యవసాయాధికారిని మంజుల,సహాయ వ్యవసాయాధికారి అర్చన, ఆర్ఐ ఊర్మిళ, విఆర్ఓ ఉమ్లాల్,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ  వైస్ చెయిర్మన్ కుందారపు శెంకరమ్మ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బోరుకుతే నాగయ్య,నాయకులూ చెన్నసోమ శేఖర్, చిరంజీవి గౌడ్, మడ్డి  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment