Wednesday, 2 May 2018

దాహార్థికై జనవాసాలొక్కి వచ్చిన చుక్కల దుప్పి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 2 ; రెబ్బెన మండలంలోని గోలేటి గ్రమంలో గల మానేపల్లి కుంటలోని నీటి కోసం వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించడంతో భయంతో జనావాసాల్లోకీ వచ్చి చేరింది. కుక్కల దాడిలో గాయాల పాలైన దుప్పి స్థానిక అంబేత్కర్ నగర్ కాలనిలోకి రావడంతో కాలనీ జనం గమనించి దుప్పిని పట్టుకొని స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గోలేటి బీట్ అధికారి మహమూద్ షరీఫ్ సంఘటన స్థలానికి చేరుకొని గాయాల పాలైన దుప్పికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాపాయం ఏమి లేదని తేలటంతో దుప్పిని తిరిగి రేంజ్ పరిధిలోని 304 కంపార్ట్మెంట్లో గల అటవీ ప్రాంతంలో దుప్పిని వదిలేసినట్లు సెక్షన్ ఆఫీసర్ అత్తరోద్దిన్ తెలిపారు.

No comments:

Post a Comment