Saturday, 12 May 2018

యువతి పై అత్యాచారం ; యువకుడిపై కేసు నమోదు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 12 ;  రెబ్బెన మండలం  నవేగం గ్రామంలో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అమ్మమ్మ  వాళ్ళ ఇంటికి వెళ్తున్న 19 సంవత్సరాల యువతిని  అటకాయించి బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్లి ఫణిగంటి సంతోష్ అనే యువకుడు (23 ) అత్యాచారం చేసినట్లు, బాధితురాలి మేనమామ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెబ్బెన  ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో మొదట కాగజ్ నగర్ లోని ఆసుపత్రికి, అక్కడనుంచి మంచిర్యాల తరలించినట్లు తెలిపారు.  ఆసిఫాబాద్  సర్కిల్ ఇన్సపెక్టర్  బాలాజీ వరప్రసాద్ పర్యవేక్షణలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

No comments:

Post a Comment