Monday, 7 May 2018

10 వ తేదినుండి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల మరియు రైతు బందు చెక్కుల పంపిణి కార్యక్రమం


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే7  ; ఈ నెల  10 వ తేదినుండి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణి మరియు రైతుబంధు చెక్కుల పంపిణి  మొదలు పెడుతున్నట్లు రెబ్బెన  తహసీల్దార్ సాయన్నతెలిపారు. రెబ్బెనమండల తహసీల్దార్ కార్యాలయంలో సర్పంచులు, గ్రామా అధికారులతో  ఏర్పాటు  చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణి ఈ నెల 10 న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే రైతు బందు పథకం చెక్కుల పంపిణి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ముఖ్య మంత్రి కెసిఆర్ 10 గంటలకు పథకాన్ని ప్రారంభిస్తారని, తదనంతరం  గ్రామాలలో పంపిణి చేయనున్నట్లు తెలిపారు. 11 వ తేదీనుంచి ఉదయం 7 నుంచి 11 వరకు, సాయంత్రం 5 నుంచి 7. 30 వరకు పంపిణి ఉంటుందన్నారు.     ప్రజల అవగాహనా కొరకు గ్రామాలలో డప్పు చాటింపు ద్వారా  తెలియ పరచాలని కోరారు. ఏమైనా భూ రికార్డులలో తేడాలున్నట్లైతే వాటిని   రెవిన్యూ అధికారుల దృష్టికి తీసుకొనివస్తే సరిచేసి  పట్టా పాస్ పుస్తకాలతో పటు చెక్కుల పంపిణి చేస్తారన్నారు. గ్రామ  పంచాయతీ కార్యాలయాలలో వి ఆర్ ఏ ,వి ఆర్ ఓ లు అందుబాటులో ఉంటారని, వారితో పటు వ్యవసాయ అధికారులు చెక్కుల పంపిణి   చేపడతారన్నారు. చెక్కులు జారీ ఐన తేదీ నుంచి   మూడు నెలలలోపు నగదుగా మార్చుకోవచ్చన్నారు.లబ్ది దారులు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు  తీసుకోని రావాలన్నారు.      ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు పెసర వెంకటమ్మ, గజ్జెల సుశీల, తోట లక్ష్మణ్, వ్యవసాయ అధికారులు మంజుల, అర్చన, వి ఆర్ ఓ   ఉమ్లాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment