Wednesday, 16 May 2018

రైతు బంధు పథకం ద్వారా చెక్కుల పంపిణీని


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 16 ;   తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా చెక్కుల పంపిణీని   రెబ్బెన మండలం లోని నేర్పల్లి , కొమురవెల్లి, గ్రామాలలో బుధవారం నిర్వహించారు.  ఈ గ్రామాలలో   ఎంపిపి సంజీవ్ కుమార్ తహసీల్దార్ సాయన్న ఏవో మంజుల లు  రైతు బంధు చెక్కులు,కొత్త పట్టా పాసుపుస్తకాలు పంపిణి చేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పంటల పెట్టుబడికి ముందస్తుగా   ఇస్తున్న చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  , రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్,  వి ఆర్ ఓ ఉమ్లాల్,  ఆర్ ఐ ఊర్మిళ ,  ఏ ఈ ఓ అర్చన , ఏఈఓ రాకేష్,  నాయకులు వి రమేష్ పి శ్రీనివాస్ గౌడ్, వి శ్రీనివాస్ ,చెన్న సోమశేఖర్ రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment