Wednesday, 2 May 2018

కాళీ మాత విగ్రహావిష్కరణ


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 2 ; రెబ్బెన మండలం ఇందిరానగర్ లో గల కనకదుర్గ దేవి మందిరంలో  ఏర్పాటుచేసిన 21 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని, 12 పడగల నాగదేవత విగ్రహాన్ని బుధవారం   ఆలయం  ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ సి  , ఎం ఎల్ ఏ  లు మాట్లాడుతూ ప్రజలలో దైవచింతన పెరుగు తుందన్నారు. అంతకు ముందు ఆలయంలో ప్రేత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ సు ఖ సంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకొన్నట్లు తెలిపారు.  ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మంగళ వరం జరిగిన  చండీయాగం లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.అదే విధంగా గురువారం జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి దేవర వినోద్, ఆలయ కొమిటీ చైర్మన్ సంతోష్ కుమార్, వైస్ ఎం పి పి  రేణుక, మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుందారపు  శంకరమ్మ,సర్పంచ్ పెసర వెంకటమ్మ,   ఉప సర్పంచ్  బొమ్మినేని శ్రీధర్, తెరాస మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి,శ్రీనివాస్ రావు, తెరాస నాయకులూ సోమశేఖర్, శ్రీనివాస్ గౌడ్, సంబాగౌడ్, సింగల్ విండో డైరెక్టర్  మధునయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment