కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 18 ; రెబ్బెన ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో రామగిరి ట్రైన్ లో రవాణా చేయటానికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం నిల్వలను టాస్క్ ఫోర్స్ సి. ఐ రాంబాబు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితమైన నిఘా సమాచారం తో ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్ ఆవరణలో తనిఖీ చేయగా గౌరిశెట్టి లక్ష్మణ మూర్తి, ఎనగందుల లక్ష్మి, కనక లచ్చమ్మ మరియు దుర్కి పోసు అనే నలుగురు వ్యక్తులు రవాణాకు సిద్దంగా ఉంచిన 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం రెబ్బెన పి.ఎస్. కు అప్పగించడం జరిగింది అన్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు ఉన్నారు.
No comments:
Post a Comment