కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 31 ; (రెబ్బెన) ; తెలంగాణ క్రీడా పాఠశాలల ప్రవేశాల కొరకు మండల స్థాయిలలో ఎంపికలు జరగనున్నట్లు రెబ్బెన మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే ఎంపిక పోటీలు గోలేటి సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో జూన్ 3 వ తేదీన ఉదయం 7.00 గంటల నుండి నిర్వహించబడునని అన్నారు. ఇట్టి అవకాశాన్ని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ఎంపిక పోటీలు జిల్లా విద్యా శాఖ మరియు పోలీస్ శాఖ వారితో సంయుక్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
No comments:
Post a Comment