కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 3 ; కాంట్రాక్టర్ నిర్లక్ష్యం సింగరేణి అధికారులు ఒంటి కాలు వ్యవహారంతో కైరిగూడ ఓసిపి లోని డిబిఎల్ కంపెనీలో వాల్వో డ్రైవర్ ప్రమాదానికి గురయ్యాడని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం డిబిఎల్ కంపెనీ వాల్వో లారీలు ఢీకొని డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా. గురువారం సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గురైన వాల్వో లారీని పరిశీలించి ఈ అనంతరం వారు ఆయన మాట్లాడుతూ డిబిఎల్ కంపెనీ యాజమాన్యం సరియైన రక్షణ సూత్రాలు పాటించకుండా కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని అన్నారు. కార్మికులపై ఒత్తిడి తెచ్చి ఒకే రోడ్డుపై ఎక్కువ వాహనాలు నడపడం వల్ల రోడ్డు కు కావాల్సినంత వెడెల్పు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. మూల మలుపుల వద్ద డివైడర్లను నిర్మించకపోవడంతో రోడ్డు పై ఏర్పడుతున్న దుమ్ము దూళి లేవకుండ పూర్తి స్థాయిలో వాటర్ స్ప్రింక్లింగ్ పనులు చేపట్టడంలో డిబిఎల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మూల మలుపుల వద్ద దుమ్ము అధికంగా ఉన్న కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అని దానికి డిబిఎల్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. కాంట్రాక్టర్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి నిరోధించడంలో నిర్లక్ష్యంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా సరియైన రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిబిఎల్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి గురైన వోల్వో డ్రైవర్ చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి తాళ్ళపల్లి రాములు, జిఎం చర్చల కమిటీ సభ్యులు రాంరెడ్డి, చార్లెస్ సేఫ్టీ కమిటీ సభ్యులు మారిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment