Wednesday, 2 May 2018

తెరాస నాయకులపై బురద చల్లుడుమానుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 2 ; భూ వివాద విషయంలో  తెరాస నాయకులపై బురద చల్లుడుమానుకోవాలని షెడ్యూల్ కుల సంఘ నాయకులు,గౌడ కుల సంఘ,రజకుల సంఘం, మైనార్టీ సెల్ నాయకులు   అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో  సమావేశమై ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన  భూవివాదం   గురించి మాట్లాడుతు  రెబ్బెన మండల కేంద్రం లోని రెబ్బెన శివారు నందు గల సర్వే నెంబర్:309/4 నక్షా 1.77సి భూమి విషయం లో అట్టి భూమి పట్టా భూమి కాదని అసైన్డ్ భూమి అని కొంతమంది భూ కబ్జాదారులు ఇట్టి భూమిని కబ్జా చేసుకున్నారని వార్త కధనం వచ్చిందని అన్నారు. దీనిలో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. 1956 సం;లో కీ:శే:ఇప్ప చంద్రయ్య వంశానికి చెందిన భూమిని వంశపార పర్యంగా అనుభవిస్తూ  వారి  ఆర్థిక అవసరాల కోసం మొగిలి కనకయ్య కు అమ్ముకోవడం జరిగిందన్నారు.   హైకోర్టు ఎన్ ఓసి నెం 253430/2014 ఆర్ధర్ తో రిజిస్టర్ చేసుకొని పట్టా పాసుపుస్తకాలు పొందిన తర్వాత ఆ భూమిని అమ్మడం జరిగిందన్నారు. అట్టి భూమి ప్రభుత్వభూమి కాదన్నారు. ఇట్టి భూ-వివాదంలో రెబ్బెన మండల కేంద్రానికి చెందిన తెరాస నాయకులు, గౌడ సంఘం  జిల్లా నాయకుడు  మోడెం సుదర్శన్ గౌడ్, తెరాస  జిల్లా ప్రధాన కార్యదర్శి  చెన్న సోమశేఖర్ , గౌడ సంగమ్ నాయకులు  మోడెం సర్వేశ్వర్ గౌడ్ ల రాజకీయ ఆర్థిక ఎదుగుదలను చూడ లేక వారిని నష్టపరిచే విదంగా వీరిపై కేసులు పెట్టించి పోలీస్ వారికీ తప్పుడు సమాచారం ఇచ్చి నష్టాల పాలు చేస్తున్నారన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులకు  దుష్ట శక్తులు సహకరిస్తు తెరాస నాయకుల రాజకీయ ఎదుగుదలను నష్టపరుస్తున్నారని  అన్నారు. భూమి విషయంలో వాస్తవం లేకపోవడం వల్ల  దీనిపై నేటివరకు ఏ ఒక్కరిని అరెస్టు చేయలేదు అన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో రామడుగుల శెంకర్, అజ్మేర రమేష్,మోడెం వెంకటేశ్వర్ గౌడ్,  ఇంగు మల్లేష్, మడ్డి శ్రీనివాస్ గౌడ్, దుర్గం బరత్వజ్, బొంగు నర్సింగరావు, మోడెం రాజాగౌడ్, తాళ్లపెల్లి కిష్టాగౌడ్, రాపర్తి అశోక్, చిలుముల నర్సిములు తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment