Wednesday, 16 May 2018

నాలాలో పడి వృద్ధురాలి మృతి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 16 ;  రెబ్బెన మండలం కొండపల్లి గ్రామా శివారులో గల  ప్రధాన రహదారిపైగల వంతెన కింద గల  నీటి గుంటలో పడి సోనుల్లే  తనుబాయి (75) చనిపోయిందని బుధవారం రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా మతిస్తిమితంలేక తన రెండవ కుమారుడైన శంకర్ ఇంట్లోనివసిస్తున్నదని, రెండురోజులక్రితం ఇంటినుండి బయటకు వెళ్లిందని కుటుంబసభ్యులు అంతట వెదికినా ఆమె  సమాచారం లభ్యం కాలేదన్నారు. బహిర్భుమికి వెళ్లి కళ్ళు సరిగా కనిపించక  ప్రమాదవశాత్తు నాలా లో పడి  చనిపోయి ఉండవచ్చని భావించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

No comments:

Post a Comment