కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 12 ; బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 2018-19 సంవత్సరానికి గాను వృత్తి విద్యా కోర్సులను త్వరలో ప్రారంభించనున్నదని ఏరియా డీజీఎం పర్సనల్ కిరణ్ తెలిపారు. టైలరింగ్, కంప్యూటర్ డిటిపి, మగ్గం వర్కు, ఫ్యాషన్ డిజైన, సారీ రోలింగ్ ,బంజారా బ్యాగులు, రెక్సిన్ లెదర్ బ్యాగులు, మోటార్ డ్రైవింగ్ కోర్సులు నిర్వహించనున్నాయని ఈ కోర్సులు నేర్చుకునే వారు, మరియు నేర్పించే శిక్షకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హత ఆసక్తి గల సింగరేణి కార్మికుల పిల్లలు, ఆర్ అండ్ ఆర్ సెంటర్స్, భూ నిర్వాసితులు , మాజీ కార్మికుల పిల్లలు పై కోర్సులలో చేరడానికి 30-05-2018 లోగ పెర్సొన్నల్ విభాగం , బెల్లంపల్లి ఏరియా గోలేటి కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గోలేటి టౌన్ షిప్ లో మహిళల్లకు ప్రత్యేకంగా మోటార్ డ్రైవింగ్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే భూ నిర్వాసితుల పిల్లలు కూడా డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చుటకు ఏర్పాటు చేసిందని కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. జూన్ నెల నుండి కోర్సులు ప్రారంభమవుతాయి అని తెలిపారు.
No comments:
Post a Comment