Thursday, 17 May 2018

దళితులపై ఎన్ని అఘాయిత్యాలు జరిగిన పట్టించుకోని ప్రభుత్వాలు : మందకృష్ణ మాదిగ


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (రెబ్బెన) మే 17 ; దళితులపై ఇప్పటికీ అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం  పట్టించుకోవడం లేదు అని మందకృష్ణ అన్నారు.  గురువారం రెబ్బెన ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేశారు అనంతరం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎస్సి ఎస్టీ పరిరక్షణ సదస్సులో అయన మాట్లాడారు.  దళితులను అణగదొక్కడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపన్ని అట్రాసిటీ నిర్విరామం  చేస్తుందన్నారు దీన్ని కాపాడుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు ఏకం కావాలని అయన  పిలుపునిచ్చారు ఎం హెచ్  మరియు గుజరాత్ రాష్టాల్లో  పదకొండు మంది దళితులను  చంపినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. కేంద్రం కూడా దళితులపై వివక్ష చూపుతుంది అని అన్నారు.  న్యాయ వ్యవస్థ దళితులను అణగదొక్కాలని చూస్తుందని విమర్శించారు. అట్రాసిటీ యాక్టు ఉన్నప్పుడే రక్షణ లేకుండా పోతుంటే సుప్రీంకోర్టు ఆ ఒక్క యాక్ట్ అవసరం లేదని తీర్పు చెప్పడం వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందన్నారు.  కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుంటే ఇప్పటికే స్పందించేదన్నారు.  దేశంలోని ఎస్సీ ఎస్టీలను ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్లో జరిగే  దళిత గిరిజన, సింహగర్జన మహాసభ నిర్వహిస్తున్నామని దానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జి చెన్నయ్య, దుర్గం గోపాల్, సొల్లు లక్ష్మి, దుండ్ర శ్రీనివాస్, దుర్గం సోమయ్య, రేగుంట కేశవరావు, కొయ్యల హేమాజీ, గద్దల బానయ్య, అజ్మీర బాబురావు, ఆత్మారాం, శోభన్ బాబు, కొట్నాక విజయ్ కుమార్, రజీహైదర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment