Sunday, 20 May 2018

త్రాగునీటి సమస్యపై స్పందించని పంచాయతీ సెక్రటరీ ; అజ్మీరా రామ్ నాయక్




 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (రెబ్బెన) మే 20 ;  మాధవాయ్ గూడలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని గ్రామస్తులు తెలపడంతో పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా సరైనస్పందన లేదని బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అజ్మీరా రామ్ నాయక్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలంలోని పలు గ్రామాలలో సమస్యలను తెలుసుకునేందుకు   పర్యటించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ మాధవాయ్ గూడలో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని తేలడంతో పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా సరైనస్పందన లేకపోవడంతో సమస్యను జిల్లా పంచాయతీ అధికారి,  జిల్లా పాలనాధికారి దృష్టికి చరవాణి ద్వారా సమస్యను వివరించినట్లు తెలిపారు. పాలనాధికారి త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు.  లక్ష్మి పుర గ్రామంలో పెన్షన్ సమస్యలు అధికంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. పుంజుమ్మెరాగూడ గ్రామంలో మిషన్ కాకతీయ చెరువు ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు తెలపడంతో ఎస్ సి గుణవంతరావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ బృందంలో బీజేవైఎం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురాపు సంజీవ్, బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షులు ఎలమంచిలి  సునీల్ చౌదరి,  వాడై గుండయ్య, చౌదరి తిరుపతి, శ్రీనివాస్, దిలీప్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment