Friday, 29 September 2017

మార్కండేయ స్వచ్చంధ సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానశిబిరం

మార్కండేయ స్వచ్చంధ సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానశిబిరం 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 :   కోండా లక్ష్మణ్ బాపూజి జయంతి సందర్బముగా శుక్రవారము కాగజ్ నగర్ ESI HOSPITAL,  నందు శ్రీ మార్కండేయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో తలసిమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు  రక్తదాన శిబిరము ఏర్పాటు చేయటం జరిగింది. 21 మంది రక్తదాతలు రక్తదానం చేసారు.  ఈకార్యక్రమములో శ్రీ మార్కండేయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్వవస్థాపకులు దాసరి నాగరాణి వెంకటేష్, సభ్యులు  కోండా విజయ్, ధన్ రాజ్ మరియు బాజాపా సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ కొంగ సత్యనారాయణ, Red cross society కన్వీనర్ డా|| శ్రీనివాస్, డా|| విద్యాసాగర్,  రాష్ట్ర పద్మ శాలి సంఘ వైస్ ప్రసిడెంట్ నల్ల కనకయ్య, జిల్లా జాగృతి కన్వీనర్ పర్శ చంద్రశేఖర్,T WTU జిల్లా అద్యక్షులు CH ప్రసాద్, TUTF జిల్లా అధ్యక్షులు విశ్వ ప్రసాద్,  లక్ష్మణ్ సేవా సదన్ సోసైటి గౌరవ ప్రదాన కార్యదర్శి బోద్దున బాపూజి, బిసి వెల్పర్ మాజి అద్యక్షులు మార్త సత్యనారాయణ, జిల్లా మహిళా ప్రదాన కార్యదర్శి మామిడాల మమత, జాగృతి తాలూకా కన్వీనర్ జంగం లక్ష్మయ్య, మాచర్ల శ్రీనివాస్, హనుమండ్ల రాజన్న, కోడం రవిందర్, దోమల సురవర్ధన్, అవదూత శ్రీనివాస్, పేరాల శివ, వనమాల శ్రీకాంత్, వనమాల గణేష్, ఈర్ల సునిల్  ప్రతి ఒక్క రక్తదాతాకు తలసిమియా, సికిల్ సెల్ సొసైటీ తరుపున మరియు మంచిర్యాల్ రెడ్ క్రాస్ సొసైటీ తరుపున ధన్యవాదములు తేలిపారు.

ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌ స్మృతి లో మోహురం పీరీల పండుగ

ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌ స్మృతి లో మోహురం పీరీల పండుగ 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 :   పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు."ఆషూరా", కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. ఇంతటి గణ చరిత్ర గల మోహురం పండుగని రెబ్బెన మండలం  లోని పుంజుమెరగుడ లో వైభవంగా కులమతాలకు అతీతంగా  నిర్వహిచడం జరిగింది.  ఇంతటి మహిమ  కలిగిన బంగాళా కి ఇతర రాష్ట్రాల నుండికూడా అధిక సంఖ్య లో భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు.ఈ సందర్బంగా శుక్రవారము  పీరీలను గ్రామాల  విదులలలో ఊరేగించడం జరిగింది 

సింగరేణి కార్మికుల హక్కుల సాధన టి జి బి కే ఎస్ తోనే సాధ్యం ; జోగు రామన్న

సింగరేణి  కార్మికుల హక్కుల సాధన  టి జి బి కే ఎస్   తోనే  సాధ్యం  ; జోగు రామన్న
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 :  సింగరేణి  కార్మికుల హక్కుల సాధన సంక్షేమంతో పాటు వారసత్వ ఉద్యోగలను ఇవ్వడనికి టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ సఖ మంత్రి జోగు రామన్న అన్నారు.   సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఖైర్ గూడ ఓపెన్ కాస్ట్ వద్ద నిర్వహించిన సమావేశంలో   లోగురామన్న మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి పెద్దపీటవేసింది కే సి ఆర్ మాత్రమేనని, ఎన్నికలప్పుడే  కనపడి,అప్రజావామిక పొత్తులుపెట్టుకొని కార్మికులను మోసంచేస్తున్న   జాతీయ సంఘాలకు అక్టోబర్  5 న   జరిగే ఎన్నికలలో తగిన బుడ్డి చెప్పాలని అన్నారు. కేసీఆర్ చేసిన ప్రకటనతో టి జి బి కే ఎస్ కార్యాలయం వద్ద కార్మికులు బాణసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్లనే వారసత్వ ఉద్యోగాలు వస్తాయనిన్నారు. జాతీయ సంఘాలైన సంఘాలు కనీసం అసెంబ్లీలో ఒక్క సీటు లేని సంఘాలు  వారసత్వ ఉద్యోగాలు  ఎలా వస్తాయి ఆయన డిమాండ్ చేశారు.మంత్రి కెసిఆర్ పంపించిన దూతగా ఒక్క మంత్రి గానీ చెప్తున్నా ఈ దసరా కానుకగా టీబీజీకేఎస్ ను గెలిపిస్తే దీపావలి  లోపు వారసత్వ ఉద్యోగాలు కానుకగా మీకు ఇస్తున్నామని.జాతీయ సంఘాలు జాతీయ పార్టీలు ఈరోజు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడని ఏం చేస్తారు మీ అభివృద్ధి అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ ఎమ్మెల్యే ఉన్నా ఏమీ లేదు ఇప్పుడు ఎలా చేస్తారు.  ప్రతి కార్మికుడు టిబిజీకె ఎస్ బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జోగురామన్నతో పటు  కార్మిక నాయకులు  ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ టి జి బి కే ఎస్  ప్రధాన కార్యదర్శి కేంగర్ల మల్లయ్య,ఎమ్మెల్యేలు కోవ లక్మి, దుర్గం చిన్నయ్య, సోయం బాబురావు, పాల్గొన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసారు. 

ఖబరస్తాన్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం

ఖబరస్తాన్ చుట్టూ  ప్రహరీ    గోడ నిర్మాణం  

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 :  రెబ్బెనలో ముస్లిం సోదరుల శ్మశానవాటిక చుట్టూ   అసంపూర్తిగా ఉన్న ప్రహారీగోడ నిర్మాణానికి శుక్రవారం పనులు ప్రారంభించారు స్థానిక ఎం ఎల్ సీ  ,ఎం ఎల్  ఏ  నిధులతో గ్రామపంచాయితీ మరియు . సింగల్ విండో అధ్యక్షులు మధునయ్య ఆధ్వర్యంలో శుక్రవారంనాడు నిర్మాణ పనులు మొదలుపెట్టారు.

ఘనంగా సద్దుల బతుకమ్మవేడుకలు

ఘనంగా  సద్దుల బతుకమ్మవేడుకలు 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 :  తెలంగాణ పూల పండగైనా బతుకమ్మ  పండుగ చివరిరోజున  మహిళలు పిల్లలు అట పాటలతో ఘనంగా  సద్దుల బతుకమ్మ పండగ   నిర్వహించారు ఈ సందర్బముగా  ఇంటి ఇంటికి  బతుకమ్మలను రంగు రంగు పూలతో అలంకరించారు మహిళలు పిల్లలు నూతన వస్రాలతో  బతుకమ్మలను ఉరే గుంపుగా రావడంతో ఎంతో కనువిందుగా కనిపించింది బతుకమ్మపాటలతో  పాటు కోలాటం దాండియా  ఆడుతూ ఎంతో ఉత్సాహముగా గడిపారు రకరకాల తియ్యటి పదార్థలతో పంచుకొని శుభాకంక్షాలు తెలుపుకున్నారు జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్, మండలకేంద్రాలైన  కాగజనగర్  రెబ్బెన, గోలేటి ,  మరియు జిల్లా  అంతటా   సద్దుల  బతుకమ్మ  ఘనంగా  నిర్వహించారు

"శ్రీ సరస్వతి దేవి అలంకారణతో కొలువుదీరిన దుర్గాదేవి

"శ్రీ  సరస్వతి దేవి  అలంకారణతో కొలువుదీరిన  దుర్గాదేవి 
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 :  శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని రెబ్బన ఇందిరానగర్ లో శ్రీ కనక దుర్గ దేవి మరియు మహంకాళి దేవాలయంలో బుధవారంనాడు   శ్రీ సరస్వతి అలంకరణలో  పూజలు అందుకుంటున్న దుర్గాదేవి. "శ్రీ  సరస్వతి దేవి  అలంకారణతో  ఉన్న అమ్మవారికి ప్రతీక  పూజలు మరియు కుంకుమ అర్చనలు  నిర్వహించడానికి రెబ్బెన మండలం నలుమూలనుంచి   భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  ఆలయం పూజారి దేవర వినోద్ భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందచేశారు.

Wednesday, 27 September 2017

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో బాణం గుర్తుకు వోటు వేసి గెలిపించాలి ; ఎం ఎల్ సీ పురాణం సతీష్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో బాణం గుర్తుకు వోటు వేసి గెలిపించాలి ;ఎం ఎల్ సీ  పురాణం సతీష్  

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 : సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలు రాకపోవడానికి  అన్ని  జాతీయ సంఘాలే కారణమని  అని ఎం ఎల్ సీ  పురాణం సతీష్ ,  ఎం ఎల్ ఏ  లు  దుర్గం చిన్నయ్య, కోవలక్ష్మిలు  అన్నారు.  గుర్తింపు సంఘం ఎన్నికలలో బాణం గుర్తుకు వోటు వేసి గెలిపించాలని , వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరించే సత్తా ఒక్క సీఎం కెసిఆర్ కె ఉందన్నారు . అవసరమైతే చట్ట సవరణకు కూడా సీఎం వెనకాడరని అన్నారు.  ఉమ్మడి రాష్టం లో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు చట్టబద్ధమైన హక్కులను పోగొట్టిందే ఏఐటీయూసీ నాయకులని విమర్శించారు, సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ  ఈ విషయం తెలుసు అన్నారు.  సీఎం కెసిఆర్  సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తానని ప్రకటన చేసిన వెంటనే ఏఐటీయూసీ నాయకులూ దొంగ చాటున వెళ్లి కోర్ట్ లో కేసు వేసి వారసత్వ ఉద్యోగాలు రాకుండా అడ్డుకుందాని ఆరోపించారు. ఆనాడు గుర్తింపు  సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచి కార్మికులకు చేసిందేమి లేదని విమర్శించారు.   టిబిజికెఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచాక ఎంపీ కవిత ఆధ్వర్యం లో కార్మికులకు అనేక హక్కులు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా కృషి చేశామని గుర్తు చేసారు ఈ కార్యక్రమం లో  టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు సదాశివ్, నాయకులూ శ్రీనివాస్, రాంబాబు, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

రేణుక ఎల్లమ్మ దేవాలయం లో విగ్రహ ప్రతిష్టాపన

రేణుక ఎల్లమ్మ దేవాలయం లో విగ్రహ ప్రతిష్టాపన 


కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 : రెబ్బెన మండల కేంద్రంలో బుధవారంనాడు నూతనముగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయం లో విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవముగా,వేదపండితుల చేయజ్ఞ యాగాదులు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆసిఫాబాద్ ఎం ఎల్  ఏ కోవాలష్మి హాజరయ్యారు. భక్తులు అధికసంఖ్యలో హాజరై తమ భక్తి ప్రపత్తు;లు చాటుకొన్నారు. స్థానిక గౌడ కులస్తులు,భక్తులు, ప్రజా ప్రతినిధులు  తమవంతు సహాయ సహకారాలు అందించుకొని ఈ నూతన ఆలయ నిర్మాణాన్ని గావించారు. . విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

"శ్రీ సరస్వతి దేవి అలంకారణతో కొలువుదీరిన దుర్గాదేవి

"శ్రీ  సరస్వతి దేవి  అలంకారణతో కొలువుదీరిన  దుర్గాదేవి 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 : శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని రెబ్బన ఇందిరానగర్ లో శ్రీ కనక దుర్గ దేవి మరియు మహంకాళి దేవాలయంలో బుధవారంనాడు   శ్రీ సరస్వతి అలంకరణలో  పూజలు అందుకుంటున్న దుర్గాదేవి. "శ్రీ  సరస్వతి దేవి  అలంకారణతో  ఉన్న అమ్మవారికి ప్రతీక  పూజలు మరియు కుంకుమ అర్చనలు  నిర్వహించడానికి రెబ్బెన మండలం నలుమూలనుంచి   భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  ఆలయం పూజారి దేవర వినోద్ భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందచేశారు. 

కొండ లక్ష్మన్ బాపూజీ 102వ జయంతి వేడుకలు

కొండ లక్ష్మన్ బాపూజీ 102వ జయంతి వేడుకలు 

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 :  కొండ లక్ష్మన్ బాపూజీ 102వ జయంతి వేడుకలను  రెబ్బెన మండ లం లోని అతిథి గృహంలో బిసి ఐక్య సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు కేసరి ఆంజనేయులుగౌడ్ జిల్లా కార్యదర్శి భోగె ఉపేందర్  ఆయన ఫోటో కు పూలమాల అలంకరించి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమములో బీసీ మోర్చా  ప్రధాన కార్యదర్శి రాచకొండ రాజు బిజెపి మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి    మల్రాజు  రాంబాబు రజక సంఘం మండలాధ్యక్షుడు రామడుగుల శంకర్  సాగర్ గౌడ్ కిసాన్ మొర్చ జిల్లా అధ్యక్షుడు యలమంచి సునీల్ చౌదరి బీజేవైఎం మండల అధ్యక్షులు ఇగురపూ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ చుక్క గుర్తుకే ఓటు వెయ్యండి ; టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఏఐటీయూసీ  చుక్క గుర్తుకే ఓటు వెయ్యండి 
                                   టీపీసీసీ ప్రధాన కార్యదర్శి  మాజీ  ఎమ్మెల్యే ఆత్రం సక్కు 

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 :    సింగరేణిలో ఐఎన్టీయూసీ బలపరుస్తున్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చుక్క గుర్తుకే కార్మికులు  ఓటు  వెయ్యాలని  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి  ఆసిఫాబాద్ మాజీ  ఎమ్మెల్యే ఆత్రం సక్కు కార్మికులకు  మరొకసారి విజ్ఞప్తి చేశారు. బుధవారం రెబ్బెన మండలం గోలేటి బస్టాండ్ లోని సీపీఐ తాత్కాలిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీబీజీకేఎస్ గత నాలుగు సంవత్సరాల కాలంలో   కార్మికులకు చేసింది   ఏమిలేదని  ఈ విషయం కార్మికులకు బాగా తెలుసనీ అక్టోబర్ 5 న జరిగే ఎన్నికలలో కార్మికులు ఈ విషయాన్నీ నిరూపిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో . ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్ర్షి  ఎస్.తిరుపతి నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో తెరాస పతనం ఖాయం ; కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పిఎస్ఆర్

సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో  తెరాస పతనం ఖాయం 
                   కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పిఎస్ఆర్ 

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 26 :    సింగరేణిలో గత   ఎన్నికల్లో సెంటిమెంటును అడ్డంపెట్టుకొని గెలుపొందిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా  ఉండి సింగరేణి కార్మికుల హక్కులను సర్వ నాశనం చేసిందని, సంస్థను కార్మికులే కాపాడుకోవలసిన పరిస్థితి నెలకొన్నదని ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు అన్నారు. మంగళవారం రాత్రి రెబ్బన బెల్లంపల్లి ఏరియా  గోలేటిటౌన్ షిప్ లోని   సీఈఆర్ క్లబ్ లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసి కార్మిక సంఘాల  జనరల్ బాడి సమావేశంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొని  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తూ,అప్రజాస్వామిక పాలనను రుచి చూపిస్తున్నారని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు టి.నర్సింహాన్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థలు  తాడిచర్ల-1, తాడిచర్ల-2 బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు  పన్నగా జాతీయ సంఘాలు దానిని గమనించి అనేక పోరాటాలు చేసి  అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఆగిందన్నారు. అక్టోబర్ 5 న జరగబోయే గుర్తింపు ఎన్నికల్లో తెబొగకాసంను  గెలిపిస్తే సింగరేణి ప్రైవేటు పరం కావటం కాయం అన్నారు. సింగరేణి సీఎండీ గ ఉన్న శ్రీధర్ కేసీఆర్కు గుమస్తాగా మారారని విమర్శించారు . గడిచిన మూడేళ్లలో  సింగరేణి వ్యాప్తంగా 30మంది కార్మికులు గని ప్రమాదంలో మృతి చెందిన ఏ ఒక్క కార్మికుని కుటుంబాన్ని పరామర్శించేందుకు సీ అండ్ ఎండీకి తీరలేదన్నారు.  2012 లో వారసత్వ ఉద్యోగాల  పేరుతో గెలిచినా టీబీజీకేఎస్ దొంగ నోటిఫికేషన్ లతో కార్మికులను మోసం చేసిందన్నారు. టీబీజీకేఎస్ నాయకులూ గనుల ఫై వెళ్లే మొకం లేక ఎంపీలు, ఎమ్మెల్యే లతో,  తెరాస కార్యకర్తలతో మీటింగ్ లు  పెట్టిస్తున్నారని అన్నారు, తెరాస ప్రభుత్వం భూగర్భ గనులను మూసివేసి ఓసిపిలను ఏర్పాటు చేస్తూ కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. సీఎం కేసీర్ చెప్పే మాటలకూ చేసే పనులకు ఎక్కడ పొంతన లేదన్నారు. గుర్తింపు ఎన్నికల్లో ఓట్లతో గెలిచే సత్తా దమ్ము లేక నోట్లు పట్టుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు  గనులపై తిరుగుతున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ,టీబీజీకేఎస్ ఎన్ని ప్రబావాలకు గురి చేసిన కార్మిక వర్గం ఎర్ర జెండా వైపే ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సీసీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుండా మల్లేష్, ఏఐటీయూసీ  రాష్ట్ర కార్యదర్శి బోసు ,సిపిఐ జిల్లా కార్యదర్శులు బద్రి  సత్యనారాయణ, కలవేణి శంకర్,డీసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వ ప్రసాద్ రావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలేష్ గౌడ్ ,ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్ర్షి  ఎస్.తిరుపతి, ఐఎన్టీయూసీ  ఏరియా ఉపాధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

Monday, 25 September 2017

పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ 101 జన్మదిన వేడుకలు

పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ 101 జన్మదిన వేడుకలు 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25   పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ 101 జన్మదిన వేడుకలు ను సోమవారం రెబ్బెన మండలం గోలేటి బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జె  బి పౌడెల్  ఘనంగా  నిర్వ హించారు. ఏ సందర్భంగా మాట్లాడుతూ పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ్ స్థాపించి  అనేక సేవలను చేసారని ,. స్వాతంత్రోద్యమంలో జనసంఘ్ పాత్ర ఎంతో  ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేసరి ఆంజనేయ గౌడ్, చక్రపాణి, కోట రాజేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

ఉద్యోగాల సాధన టిబిజికెఎస్ తోనే సాధ్యం

ఉద్యోగాల సాధన   టిబిజికెఎస్ తోనే  సాధ్యం 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25  సింగరేణి కంపెనీలో వారసత్వ ఉద్యోగాల సాధన టి ఆర్ ఎస్ అనుబంధ సంగం   టిబిజికెఎస్  తోనే సాధ్యమౌతుందని  టిబిజికెఎస్  ఉపాధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ,ఎం ఎల్ సీ  పురాణం సతీష్, ఎం ఎల్ ఏకోవా లక్ష్మి లు అన్నారు. సోమవారం  బెల్లంపల్లి  ఏరియా    గోలేటి కైరిగుడా ఓపెనకాస్ట్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు.  సమావేశంకు హాజరై వారు  మాట్లాడుతూ ఉమ్మడి రాష్టం లో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు చట్టబద్ధమైన హక్కులను పోగొట్టిందే ఏఐటీయూసీ నాయకులేనని  ఈ విషయం సింగరేణి కార్మికులందరికీ తెలుసని  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్   సింగరేణి కార్మికులకు  వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరానకు ప్రత్యేక చెర్యలు చేపడుతున్నట్లు  పేర్కొన్నారు. ఆనాడు సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టడానికి అన్ని  జాతీయ సంఘాలదే బాధ్యత అని అన్నారు.ఆనాడు గుర్తింపు  సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచి కార్మికులకు చేసిందేమి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమం లో  టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు సదాశివ్, రాష్ట్ర కమిటీ సభ్యులు  శ్రీనివాస్,  నాయకులూ రాంబాబు, ప్రకాష్ రావు,రాజు,నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు, అజమేరా బాపూరావు, కుందారపు శంకరమ్మ, కార్మికులు , తదితరులు పాల్గొన్నారు. 

చేయూత యూత్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.5 కే భోజనం

 చేయూత యూత్ సొసైటీ  ఆధ్వర్యంలో రూ.5 కే  భోజనం
 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25 చేయూత యూత్ సొసైటీ  ఆధ్వర్యంలో రూ.5 కే భోజనం కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట  ప్రారంభించారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాడుల  కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీదారులకు తమవంతుసాయంగా  చేయూత యూత్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైరాగరే ప్రతాప్, నాగపురి తిరుపతి నరే రాజేందర్, పెద్దింటి రాకేష్ , సామల అమర్, జంజీరాల శ్రీనివాస్, కుర్ర రమేష్, ముద్దపల్లి సాయి కృష్ణ తదితరులు ఉన్నారు. 

"శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి " గవ్వల అలంకారణతో కొలువుదీరిన దుర్గాదేవి

"శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి " గవ్వల అలంకారణతో కొలువుదీరిన  దుర్గాదేవి 
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25 : శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఇందిరానగర్ రెబ్బన లో శ్రీ కనక దుర్గ దేవి & మహంకాళి దేవాలయంలో పూజలు అందుకుంటున్న "శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి " గవ్వల అలంకారణతో కొలువుదీరిన బంగారు తల్లి దుర్గమ్మ ఆలయం లో లలిత సుందరి దేవి అలంకరణ లో ఉన్న అమ్మవారికి పూజలు మరియు కుంకుమ పూజలు నిర్వహించడానికి గ్రామ భక్తులు మరియు పలు చోట్ల నుంచి వచ్చిన భక్తులు ఆలయం పూజారి దేవర వినోద్ మరియు దుర్గం భరద్వాజ్ , వెంకటేష్ , మోడెమ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా హోం గార్డ్ ల సేవలు ప్రశంసనియమైనవి - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

జిల్లా హోం గార్డ్ ల సేవలు ప్రశంసనియమైనవి  - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25 :   జిల్లా లోని హోం గార్డ్స్  సేవలు ప్రశంసనియమైనవి మరియు వెలకట్టలేనివి అని జిల్లా ఎస్పి తెలిపారు. హోం గార్డ్స్ జిల్లా లో అత్యవసర సమయాలలో కూడా అందుబాటులో వుండి కానిస్టేబుల్ ల తో సమానంగా  సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పి తెలిపారు , అందుకే వారికి ఆర్థిక స్వావలంబన అందించేందుకే జిల్లా లో  “చేయూత” అనే కార్యక్రమం ను చేపట్టామని దిని ద్వార వారికి ఆర్థిక భరోసా కలిపిస్తూ, వారిలోని ఆత్మనూన్యత బావం తొలగించి  విధుల పట్ల విశ్వాసం పెంపోదిస్తున్నామని జిల్లా ఎస్పి తెలిపారు, చేయూత కార్యక్రమం లో బాగముగా ఆదివారం స్థానిక  ఎస్పి క్యాంపు కార్యాలయము లో ప్రమాద వశాత్తు మరణించిన హోం గార్డ్ తుమ్రం బికాజి కుటుంబమునకు జిల్లా ఎస్పి  చేతుల మీదుగా 5,00,000 /- లక్షల రూపాయల చెక్కు ను బార్య తుమ్రం శోభ కు అందచేశారు, అనంతరం మరణించిన తుమ్రం బికాజి బార్య శోభ తో జిల్లా ఎస్పి మాట్లాడుతూ  పిల్లల యొక్క భవిష్యత్తు కోసం జిల్లా పోలీసుల సహకారం ఎల్లప్పుడు ఉంటుందని, పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు వారికి కలిపించే బాద్యత తమ పైన కూడా వున్నదని మరణించిన బికాజి కుటుంబానికి  భరోసా కలిపించారు.అనంతరం  జిల్లా ఎస్పి చేయూత కార్యక్రమం కింద 150 మంది హోం గార్డ్ లకు  యూనిఫాం, బెల్ట్  ,క్యాప్, షూ  మరియు జెర్సి లను అందించి పోలీసు యొక్క ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వర్తించాలని ప్రోత్సహించారు, అనంతరం హోం గార్డ్ లతో జిల్లా ఎస్పి మాట్లాడుతూ జిల్లా లో హోం గార్డ్ సంక్షేమమున కే  చేయూత అను కార్యక్రమము చేపట్టామని ఈ కార్యక్రమము కింద హోం గార్డ్ లందరికి లబ్ది చేకురనుందని , విధి నిర్వహణలో ప్రమాద వశాత్తు మరణించిన లేదా గాయపడిన హోం గార్డ్లకు సాంత్వన చేకురేలా చర్యలు తీసుకుంటామని, అత్యవసర వైద్య సహాయం అవసరం అయిన హోం గార్డ్ కుటుంబాలకు వాహన సదుపాయం కూడా కలిపిస్తామని, ఆపదసమయం లో అదుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందువుంటుందని జిల్లా ఎస్పి హామీ ఇచ్చారు, ఈ నూతన ఉత్తేజం ఉపయోగించుకొని  ఆత్మ స్థైర్యం తో ఇలాగె విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమము లో ఎస్పి సిసి దుర్గం శ్రీనివాస్ , ఎస్బి సిఐ సుధాకర్ , ఎస్బి ఎస్సై లు శివకుమార్ , శ్యాం సుందర్, హోం గార్డ్ ఆర్.ఐ అనిల్ కుమార్, హోం గార్డ్ కార్యాలయ రైటర్ లు అవినాష్ , వాజిద్ ఆహ్మెద్ ఖాన్, హోం గార్డ్స్ దీపక్ , వినేష్ , జ్ఞానేశ్వర్ , గంగాధర్ , శంకర్, లు పాల్గొన్నారు.

Saturday, 23 September 2017

అవినీతి నిరోధక శాఖకు చిక్కిన రెబ్బెన తహసీల్దార్

 అవినీతి నిరోధక శాఖకు చిక్కిన  రెబ్బెన తహసీల్దార్

  • 2 లక్షలతో పట్టుబడ్డ వైనం  
  • భూమి మ్యుటేషన్ కోసం ఐదు  లక్షల డిమాండ్ 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 23:  రెబ్బెన మండలానికి చెందిన తహసీల్దార్  రమేష్ గౌడ్  ఏ సి బి వలలో చిక్కారు. వివరాలవులకి వెళితే  తహసీల్దార్  రమేష్ గౌడ్ ను ముందస్తు సమాచారం మేరకు శనివారం  వలపన్ని అదుపులోకి తీసుకున్నట్లు  అవినీతి నిరోధక శాఖ డి ఎస్ పి సుదర్శన్ తెలిపారు. డి ఎస్ పి సుదర్శన్ మాట్లాడుతూ  రెబ్బెన మండలం దేవులగుడాకు చెందిన యలమంచిలి సునీల్ చౌదరి గతసంవత్సరం    నారాయణ రావుకు చెందిన తొమ్మిదిన్నర ఎకరాల పొలాన్ని కొనుగోలుచేశారు. సదరు పొలమును పట్టా మార్పిడి చేయించడానికి తహసీల్దార్ కార్యాలయంలో ఫిబ్రవరి 2017లో  ధరఖాస్తుచేసుకున్నారు. తదనంతరం తహసీల్దార్ దరఖాస్తును పరిశీలించి సుమారు ఐదు లక్షల రూపాయలను లంచంగా   డిమాండ్ చేయటం జరిగిందని, తహసీల్దార్ తన మధ్యవర్తి ఐన చింతపురి శంకర్ ద్వారా బేరసారాలు సాగించి మూడులక్షల ఇరవై వేలకు బేరం కుదుర్చుకొన్నారు. ఈ విషయాన్నీ బాధితుడు  సునీల్  చౌదరి ఆ ని శా  అధికారులకు తెలుపగా వారు శనివారం వలపన్నిదేవులగుడలోని  బాధిత రైతు   ఇంట్లో  మధ్యవర్తి ఐన శంకర్ డబ్బులు తీసుకుంటుండగా నిఘా వేసి ఉన్న ఏ సి బి అధికారులు డబ్బులతో శంకర్ ను   ఆ ని శా  అధికారులు అదుపులోకి తీసుకున్నారు. .  ఎం ఆర్ ఓ ఆఫీసులో విచారణ జరిపి రికార్డులను పరిశీలించి, తదుపరి తహశీల్ధార్ రమేష్ గౌడ్ ను , మధ్యవర్తి శంకర్ ను కరీంనగర్ కు పంపించారు . ఈ దాడిలో ఆ ని శా సర్కిల్ ఇనస్పెక్టర్లు  కాశయ్య, వెంకటేశ్వర్లు, వీరభద్రం , వేణుగోపాల్  పాల్గొన్నారు. తహసీల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తనను ఈ కేసులో అక్రమంగా బనాయించారని, తన మంచితనాన్ని భరించలేని కొంతమంది కుట్రపన్ని ఇరికించారని అన్నారు. 

Friday, 22 September 2017

నేర పరిశోదనలో నూతన సాంకేతికత తోనే మెరుగైన ఫలితాలు – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

నేర పరిశోదనలో నూతన సాంకేతికత తోనే  మెరుగైన  ఫలితాలు ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 22 :    నేర పరిశోదనలో నూతనమైన పద్దతులను జోడించినప్పుడే మెరుగైన  ఫలితాలు వస్తాయి అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా లోని స్థానిక పోలీస్  హెడ్ క్వార్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వెరిఫై -24*7 ట్రయల్  రన్ జిల్లా ఎస్పి ప్రారంబించారు, ట్రయల్ రన్ లో బాగంగా జిల్లా లో వెరిఫై -24*7 యొక్క ఉపయోగాలను జిల్లా ఎస్పి సిబ్బందికి వివరించారు, వెరిఫై -24*7 ను సమర్దవంతం గా వాడుకొని నేర పరిశోదనలో మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలనీ జిల్లా ఎస్పి కోరారు. వెరిఫై -24*7 ద్వారా దేశ ,రాష్ట్రము లోని నేరస్తులపైన వున్నా కేసు లకు సంబందించిన అన్ని వివరాలను, ఇతర ప్రదేశాలలో నేరాల నమోదు మరియు కేసు యొక్క పూర్వ పరాలను ఒకే ప్రదేశం లో చూడవచ్చు అని పాక్షిక వివరాలు లభించినప్పటికీ నిర్దారణకు వచ్చే వీలు ఉంటుందని  జిల్లా ఎస్పి  తెలిపారు . అనంతరం సి సి టి ఎన్ స్ లో నమోదు మరియు వేగవంతమైన, క్రియాశీల ప్రతిభ కనబరిచిన ఈస్గాం ఎస్సై సుధాకర్ ను మరియు పీ.సి బబ్బెర శేఖర్ ను జిల్లా ఎస్పి అభినందించి ప్రోత్సాహకం గా వెయ్యి రూపాయల చెక్కు  ను  పీ సి-3257 బబ్బెర శేఖర్ కు అందచేశారు మరియు ఇక పై కూడా ఇలాగే మరిన్ని ప్రోత్సాహకాలు అందుకోవాలని జిల్లా ఎస్పి ఆకాంక్షించారు. అన్నిపోలీస్ స్టేషన్ ల సిబ్బంది,అధికారులు కూడా పోటిపడి పని చేసి ప్రోత్సహకాలు అందుకోవాలని సూచించారు. ఈ సమావేశం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,సిసి దుర్గం శ్రీనివాస్, ఎస్బి సిఐ సుధాకర్, ఎస్బి ఎస్సై లు శివకుమార్ , శ్యాం సుందర్ జిల్లాలోని సిఐ లు,ఎసై లు , ఐటి కోర్  ఇంచార్జ్ శ్రీనివాస్, కిరణ్ కుమార్,మాణిక్ రావు  మరియు పీఆర్ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

సింగరేణి సేవాసంస్థ ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ తరగతులు

సింగరేణి సేవాసంస్థ ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ తరగతులు 

  
 
   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 22 :    సింగరేణి సేవాసంస్థ ఆధ్వర్యంలో కార్మికుల కుటుంబ సభ్యులకు వృత్తిపరమైన శిక్షణ తరగతుల ఏర్పాటులో భాగంగ  శుక్రవారంనాడు బెల్లంపల్లి ఏరియా గోలేటిలో స్పోకెన్ ఇంగ్లీష్, బ్యూటిషన్ ,కుట్టు శిక్షణ తరగతులను గెనేరం మేనేజర్ రవిశంకర్, సేవాసమితి అధ్యక్షురాలు అనురాధ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి అనురాధ మాట్లాడుతూ  ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడూ కూడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని పెంచుకొని స్వయంఉపాధి పొందవచ్చని అన్నారు. సింగరేణి సంస్థ సేవాసంస్థకు తగు నిధులు కేటాయిస్తుందని రాబోయే కాలంలో యువకులకు మోటార్  డ్రైవింగ్, శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యురాళ్లు  సొల్లు లక్ష్మి, శంకరమ్మ, తిరుమల, విజయలక్ష్మి, వెంకటమ్మ, ఝాన్సీ, రాణి, మరియు అధికారులు  తదితరులు పాల్గొన్నారు. 

బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో అమ్మవారు

 బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో అమ్మవారు 



  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 22 :    రెబ్బెన మండలం ఇందిరా నగర్  మహంకాళీ ఆలయంలో  బా లా త్రిపురసుందరి దేవి అలంకారంలో కొలువుదీరిన   దుర్గ దేవి , పూజలో  శుక్రవారంనాడు  అసిఫాబాద్ సర్పంచ్ మర్సుకోల సరస్వతీ తిరుపతి దoపంతులు  దర్శించుకొనిప్రత్యేక పూజలు జరిపారు.  . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అస్సిసులను పొందారు, పూజారి దేవర వినోద్ పూజలను శాస్త్రోక్తముగా నిర్వహించి అమ్మవారి తీర్ధ ప్రసాదములను అందచేశారు.

ఎన్నికలకోసమే అనైతిక పొత్తుపెట్టుకొన్నజాతీయ సంఘాలు : టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్ రావు

ఎన్నికలకోసమే అనైతిక   పొత్తుపెట్టుకొన్నజాతీయ  సంఘాలు  : టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్ రావు


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 22 :   కేవలం సింగరేణి గుర్తింపు సంఘం  ఎన్నికలకోసమే అనైతిక   పొత్తుపెట్టుకొన్నజాతీయ  సంఘాలను    ఓడించాలని   టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్ రావు పిలుపిచ్చారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలం గోలేటి కైరిగుడా ఓపెనకాస్ట్ వద్ద గేట్ మీటింగ్ లో శుక్రవారం మాట్లాడుతూ  . సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా సీఎం కెసిఆర్ వారసత్వ  ఉద్యోగాలను పునరుద్ధరిస్తారని పేర్కొన్నారు. ఆనాడు సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టడానికి అన్ని  జాతీయ సంఘాలదే బాధ్యత అని అన్నారు. వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరించే సత్తా ఒక్క సీఎం కెసిఆర్ కె ఉందన్నారు . అవసరమైతే చట్ట సవరణకు కూడా సీఎం వెనకాడరని అన్నారు. ఇక పోతే నిజామాబాద్ ఎంపీ టిబిజికెఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏఐటీయూసీ నాయకులకు హెచ్చరించారు. సింగరేణి కార్మికుల కోసం అలుపు ఎరుగ  కుండా కృషికేస్తున్న ఎంపీ కవితను విమర్శించే అర్హత  ఆ సంఘం నాయకులకు లేదన్నారు . ఉమ్మడి రాష్టం లో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు చట్టబద్ధమైన హక్కులను పోగొట్టిందే ఏఐటీయూసీ నాయకులని విమర్శించారు,ఈ విషయం సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ తెలుసు అన్నారు. ఎం ఎల్ సీ  పురాణం సతీష్ మాట్లాడుతూ  సీఎం కెసిఆర్  సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తానని ప్రకటన చేసిన వెంటనే ఏఐటీయూసీ నాయకులూ దొంగ చాటున వెళ్లి కోర్ట్ లో కేసు వేసి వారసత్వ ఉద్యోగాలు రాకుండా అడ్డుకుందాని ఆరోపించారు. ఆనాడు గుర్తింపు  సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచి కార్మికులకు చేసిందేమి లేదని విమర్శించారు. ఎం ఎల్ ఏ  లు  దుర్గం చిన్నయ్య, కోవలక్ష్మిలు మాట్లాడుతూ   టిబిజికెఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచాక ఎంపీ కవిత ఆధ్వర్యం లో కార్మికులకు అనేక హక్కులు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా కృషి చేశామని గుర్తు చేసారు ఈ కార్యక్రమం లో  టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు సదాశివ్, నాయకులూ శ్రీనివాస్, రాంబాబు, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. 

Thursday, 21 September 2017

సమాజం లో గురుతర బాద్యత పోలీసులదే - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

సమాజం లో గురుతర బాద్యత పోలీసులదే  - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 21 :     సమాజం లో గురుతర బాద్యత పోలిసుల పైన ఉంటుందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  తెలిపారు. గురువారం స్థానిక  పోలీస్ హెడ్ క్వార్టర్ లొ జిల్లా ఎస్పి అద్యక్షతన  నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.నేర సమీక్షా సమావేశం లో  జిల్లా ఎస్పి మాట్లాడుతూ అప్రమత్తత, సత్వర స్పందన వల్లనే నేరాలు అదుపులో ఉంటాయని  పేర్కొన్నారు, నేరం జరిగేందుకు అవకాశం వున్న ఏ ఒక్క అంశంను కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని జిల్లా ఎస్పిఅధికారులను ఆదేశించారు , ఒకే M.O(మోడస్ ఒపరెండి) కలిగిన నేరస్తుల కదలికల పట్ల నిఘా ఉంచాలని , రోడ్ల పక్కన నిలిపివుంచిన వాహనాల లో దొంగతనం చేసేందుకు అనువుగా వుండే ప్రదేశాలలో గట్టి నిఘా ఉంచాలని ,అవసరం అయితే ఆయా ప్రదేశాలలో సిసి కెమెరా లను ఏర్పాటు చేసి , వాహనదారులకు దొంగతనాల పట్ల అవగాహన కలిపించాలని జిల్లా ఎస్పి సూచించారు. స్టేషన్ వారిగా నేరాల వివరాలను పరిశీలించిన  జిల్లా ఎస్పి వాటి పురోగతి ను పరిశీలించారు, కేసు లు సత్వరం పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు, రానున్న రోజులలో వచ్చే సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలకు ,మొహర్రం , దుర్గ నవరాత్రులకు మరియు బతుకమ్మఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు నిర్వహించి  విజయవంతం అయ్యేలా అందరు కలిసి పని చేయాలని జిల్లా ఎస్పి సూచించారు. జిల్లా లో  వరకట్నం వేదింపులు 498(A)  కేసు లు ఎక్కువగా అవుతున్నందున ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటి జిల్లా జడ్జ్ అద్యక్షతన , కొంతమంది సభ్యులతో ఒక కమిటి ను ఏర్పాటు అవుతుందని  జిల్లా ఎస్పి తెలిపారు. ఈ సమావేశం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ , సిసి దుర్గం శ్రీనివాస్, ఎస్బి సిఐ సుధాకర్, జిల్లాలోని సిఐ లు, ఎసై లు , ఐటి కోర్  ఇంచార్జ్ శ్రీనివాస్, కిరణ్ కుమార్  మరియు పీఆర్ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

దుర్గానవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

దుర్గానవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 21  :   రెబ్బెన మండలం ఇందిరానగర్లో   శ్రీ కనక దుర్గ దేవి మరియు  మహంకాళి ఆలయంలో   నవరాత్రి ఉత్సవాలు ఘనంగా పూజారీ దేవరా వినోద్ ఆద్వర్యంలో  నిర్వహించడాం జరిగింది. ఈ కార్యక్రమానికి  కాగజ్ నగర్ నియోజకవర్గం ఎం ల్ ఏ కోనేరు కొనప్ప , ఆసిఫాబాద్ ఎం ల్ ఏ కోవ లక్ష్మి  రేబ్బన తహసీల్దార్  రమేష్ గౌడ్ , మరియు అభినవ సంతోష్ ఐ బి తాండుర్ ఆలయం అద్యక్షులు మోడె o తిరుపతి గౌడ్ ,ఉపదక్షులూ కొత్రాంగి  శ్రీనివాస్ లు ,  ప్రత్యేక పూజా కార్యక్రమంలో   పాల్గొన్నారు  అనంతరం అన్న దాన కార్యక్రమం   నిర్వహించడం జరిగింది.

సింగరేణి గుర్తింపు ఎన్నికలలో ఏ ఐ టి యూ సీ ని గెలిపించండి ; ఏ ఇ టి యూ సీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్

సింగరేణి గుర్తింపు ఎన్నికలలో ఏ  ఐ  టి యూ సీ  ని గెలిపించండి ;  ఏ  ఇ  టి యూ సీ   రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 21  :    సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికులు ఏ ఐ  టి యూ సీ  ని గెలిపించాలని  ఏ  ఇ  టి యూ సీ   రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్  అన్నారు.   గురువారం రెబ్బెన  గోలెట్ కే ఎల్ మహీంద్రా భవనంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిబి జి కే ఎస్ నాయకులు ఎన్నికలలో ఇచిన హామీలను నెరవేర్చకుండా కార్మికులను మభ్య పెడుతున్నారని, కార్మికుల పక్షాన ఎప్పటికి నిలబడి పోరాటాలు చేసేది తమ యూనియన్ మాత్రమేనని అన్నారు.ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి కార్మికులను మోసంచేస్తున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాలా గుడెల్ , జిల్లా అధ్యక్షులు ఎస్. తిరుపతి, కార్యదర్శి బోగే ఉపేందర్, ఉప కార్యదర్శి  రాయల  నర్సయ్య రాజేష్,, తదితరులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి ఏరియాలో సి హెచ్ పి నూతన కార్యాలయ ప్రారంభం

బెల్లంపల్లి ఏరియాలో సి హెచ్  పి నూతన కార్యాలయ ప్రారంభం 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 21  బెల్లంపల్లి ఏరియాలో  నూతనముగా నిర్మించిన సి హెచ్  పి  కార్యాలయమును  జనరల్ మేనేజర్ సివిల్ ఎస్ రామభద్రిరాజు బెల్లంపల్లి జనరల్ మేనేజర్ రవి శంకర్ తో కలిసి గురువారంనాడు ప్రారంభించారు.  అన్ని వసతులు,సదుపాయములతో నిర్మించిన  ఈ కార్యాలయం  శుక్రవారంనుండి సిబ్బందికి అందుబాటులోకి రానుంది. దీనివలన ఈ ఏరియాలో బొగ్గు రవాణా మరింత మెరుగుపడి ఉత్పత్తి టార్గెట్ను అధిగమించటానికి దోహదపడుతుందని వక్తలు అన్నారు, ఈ కార్యక్రమంలో సివిల్ ఏ  జి ఎం  పద్మశ్రీ, క్వాలిటీ కంట్రోల్ రామగుండము రీజియన్ డ్ జి ఎం ప్రసాదరావు, అధికారులు మోహన్రెడ్డి,శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 20 September 2017

నిండుగర్భిణీని పట్టించుకోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది

నిండుగర్భిణీని పట్టించుకోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది 




      కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 20;   పురిటి నోనొప్పులతో దేవులగుడకి చెందిన  బానోతు  గంగా అనే మహిళ  రెబ్బన ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కి రాగ హాస్పత్రికి తాళాలు  వేసి ఉండడం వలన 4నుండి 6 గంటల వరకు పి హెచ్ సి ముందు పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానికులు గమనించి పి  హెచ్ సి   సిబ్బందికి  సమాచారం అందించగా వార్డు బాయ్ వచ్చి హాస్పిటల్  తాళాలు తెరిచి పేషెంట్ను లోనికి తీసుకెళ్లారు.  4 గంటల నుండి 6 గంటల వరకు 108 కి  ఫోన్ చెయ్యగా 108  సిబ్బంది కూడా స్పందించలేదు.    నిండు గర్భిణీ పురిటి నొప్పులతో  రెబ్బన ప్రభుత్వ హాసుపత్రి ముందు  రెండు గంటలపాటు ప్రసవ వేదన అనుభవిస్తూ  వేచిఉన్న స్పందించని వైద్యసిబ్బంది, అంబులెన్సుకి సమాచారం అందించిన స్పందన లేకపోవడంతో,  రెండు గంటలపాటు మహిళా ఇబ్బంది చూడలేక స్థానికులు పత్రిక వాళ్ళకి సమాచారం ఇవ్వగా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే  ఇది నా  డ్యూటీ కాదని నాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించగా వారు తోచని పరిస్థితుల్లో ఉండగా  6. 30కి  నర్సు వచ్చి చూడడం జరిగింది ఇటువంటి   పరిస్థితి పునరావృతం కాకుండా  చూడాలని స్థానికులు కోరుతున్నారు కావున  దీని ఫై సంబంధిత అధికారులు తగు చేర్య తీసుకోవని కోరుతున్నారు.

కాంట్రాక్టు కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాలి

కాంట్రాక్టు కార్మికులకు కూడా వేతనాలు  చెల్లించాలి 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 20; కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు మరియు  ,అడ్వాన్స్  25 తేదీ లోపుచెల్లించా లని :ఏఐటీయూసీ జిల్లా  కార్యదర్శి బోగే ఉపేందర్..అన్నారు. ఈ నెల 28 తేదీన బతుకమ్మ పండుగ,30 దసరా,మరియు అక్టోబర్  1 న ,మొహారం పండుగలు ఉన్నందున కాంట్రాక్టు కార్మికులకు,సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్సకు ఈ నెల 25 తేదీ లోపు వేతనాలు మరియు అడ్వాన్స్ చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బెల్లంపెళ్లి ఏరియా GM కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచి కార్యదర్శి అశోక్, Asst, కార్యదర్శి సాగర్,నాయకులు తిరుపతి,శంకర్,భీమేష్ ఆశాలు ఉన్నారు

మూడవ రోజు బతుకమ్మ చీరల పంపిణి

 మూడవ  రోజు బతుకమ్మ చీరల పంపిణి

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 20;   రెబ్బెన మండల కేంద్రంలో మూడవ  రోజు బతుకమ్మ చీరల పంపిణి ని రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, సింగల్ విండో చైర్మన్ మధునయ్య ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని 18 సంవత్సరాలు నిండిన అందరు ఆడపడుచులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ఆసిఫాబాద్ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, , గ్రామపంచాయతీ సెక్రటరీ  మురళీధర్,  సిబ్బంది,, నాయకులు పాల్గొన్నారు. 

బతుకమ్మ పండుగకు నాసిరకం చీరలు ; బి జె పి జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీమతి ఆంప్ట్

బతుకమ్మ  పండుగకు నాసిరకం చీరలు     ; బి జె పి  జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు శ్రీమతి ఆంప్ట్ 



కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 20  :  బతుకమ్మ పేరుతో నాశిరకం చీరలు పంపిణి చేస్తూ   ప్రజా దనాన్నీ వృధా చేస్తున్నారని  బి జె పి  మహిళా మోర్చ అధ్యక్షులు శ్రీమతి  ఆంప్ట్ అన్నారు.   బుధవారం కుమ్మరం భీం ఆసిబాద్  జిల్లా కేద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆమె మాట్లాడారు  . తెలంగాణ  ప్రభుత్వం బతుకమ్మ పండుగకు నాసిరకం చీరలు పంచుతూ  తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్నీ కించపరిచే విధంగాప్రవర్తించిందని అన్నారు. ఇతర మాటలవారికి ఆధార్ కార్డు లింక్ పెట్టకుండా పంపిణి చేసి కేవలం బతుకమ్మ పండుగకు మాత్రం గుర్తింపు కార్డు కావలనడం సరికాదన్నారు. ఈ తతంగమంతా కేవలం టి ఆర్ ఎస్ పార్టీ  వోట్ బ్యాంకు రాజకీయమని ఆమె అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆలకుంట శిరీష, బాంననేల ,గంగూబాయి, డోంగ్రే కవిత, సునీతా తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 19 September 2017

బతుకమ్మ సంబరాలు

 బతుకమ్మ సంబరాలు 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 19 ;   కొమరంభీం జిల్లాలోని    అన్ని పాఠశాలలలో ,కళాశాలలలొ బుధవారంనుంచి దసరా సెలవలు సందర్భంగా మంగళవారం  నాడు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అన్నికళాశాలలు, పాఠశాలలలో బతుకమ్మ సందడి కనిపించింది.. విద్యార్థినులు రకరకాల పూలతో ఆకర్షణీయముగా బతుకమ్మలను పేర్చి  బతుకమ్మ పండగను జరుపుకొనిఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

పల్లెలు ప్రశాంతత కు పట్టు కొమ్మలు - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

పల్లెలు ప్రశాంతత కు పట్టు కొమ్మలు - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 19 ;  పల్లెలు ప్రశాంతతకు నిలయం లు అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు , మంగళవారం  నూతనముగా ఏర్పాటు చేసిన చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి ఆకస్మికం గా తనిఖి చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ పని తీరును, నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను , స్టేషన్ క్రైమ్ రికార్డు ల నిర్వహణ క్రమమును మరియు  సిబ్బంది పని తీరు ను జిల్లా ఎస్పి స్వయముగా పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది  యొక్క వి.పి.ఓ విదులను గురించి అడిగి , గ్రామాలలో నెలకొని వున్నా సమస్యలను గురించి  విచారించారు,  సరిహద్దు ప్రాంతాలలో ఉన్నందున జాగరూకత తో వుండి ,  సరిహద్దు ప్రాంతాల సమాచారం ను సేకరించాలని మరియు అంతరరాష్ట్ర పోలిసుల తో స్నేహసంబందాలను కలిగి నేరస్తుల సమాచార మార్పిడి  చేసుకోవాలని అన్నారు , సరిహద్దు గ్రామాలలో నిరంతర గట్టి నిఘా ను ఉంచి రాత్రి వేళలో క్రమంతప్పకుండా పోస్ట్ ప్రొటెక్షన్ డ్రిల్ నిర్వహించాలని  జిల్లా ఎస్పి ఆదేశించారు, గ్రామాలలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉక్కుపాదం తో అణిచి వేస్తాం అని జిల్లా ఎస్పి హెచ్చరించారు. గ్రామాలలో ఎవరు అయిన అపరిచితులు వ్యక్తులు అనుమానస్పదంగా సంచరించిన పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పి కోరారు. ఈ తనిఖీ లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ , చింతలమానేపల్లె ఎసై రాజ్ కుమార్, చింతలమానేపల్లి  పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పీ.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

భూ సర్వే ను పక్కాగా నిర్వహించాలి ; జిల్లా కలెక్టర్ చంపాలాల్


భూ సర్వే ను పక్కాగా నిర్వహించాలి ; జిల్లా కలెక్టర్ చంపాలాల్ 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 19 ;  భూ సర్వే ను పక్కాగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. సర్వే లో భాగంగా  మంగళవారం  రెబ్బెన  మండలం జక్కులపల్లి గ్రామంలో  జరుగుతున్న  భూ సర్వే  ను జిల్లా కలెక్టర్ చంపాలాల్ పరిశీలించారు. రైతులను భూ సర్వే పై అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు  చేసారు. సర్వే ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో చేపట్టిందని  దానిని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తిచేయాలని అన్నారు  ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ గౌడ్, ఉప తహసీల్దార్ విష్ణు ,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ డగ్డం

రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ డగ్డం 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 19 ;   ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సి ఐ టి యూ   ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ డగ్డం చేసారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా,కార్మిక  వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు త్తెలిపారు..రాష్ట్రంలో మూతపడిన కర్మాగారాలను పునరుద్దరించాలని, ఫ్యాక్టరీల రిజిస్ట్రేషన్లను నులభై ఐదు  రోజులలో పూర్తిచేయాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని, నిత్యావసర ధరలను అదుపుచేయాలని, కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులూ దినకర్ తదితరులు పాల్గొన్నారు. 

నూతన కళాశాల భవణంలో తరగతులు నిర్వహించాలి అఖిల భారత విద్యార్థి సమాఖ్య


 నూతన కళాశాల భవణంలో తరగతులు నిర్వహించాలి    అఖిల భారత విద్యార్థి సమాఖ్య
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 19 ;     రెబ్బెన మండలంలో నూతనముగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భావనమునకు విద్యుత్తు ,మొదలగు కనీస సౌకర్యములుకల్పించి  తరగతులను నిర్వహించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలస్ విద్యార్థినులు బతుకమ్మలతో ఆందోళమా చేపట్టారు. ఈ సందర్బంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆసిఫాబాద్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్  లు   మాట్లాడుతూ  అఖిల భారత విద్యార్థి సమాఖ్య పోరాటాల ఫలితంగా నిర్మించబడిన నూతన భవనం పాలకుల అశ్రద్ధ వలన రెండుసంవత్సరాలనుండి నిరుపయోగంగా ఉండదనే కాకుండా మందుబాబులకు, నిలయంగామారిందని  దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ దసరా సెలవులలోనైనా కనీస సౌకర్యాలను కల్పించి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలను నూతన భవనం నిర్వహించాలని లేనిపక్షంలో  అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలోఆందోళనలను చేపడతామని హెచ్చరించారు . ఈ సందర్భంగా రెబ్బెన కేంద్రంలో రహదారిపై బతుకమ్మలతో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులూ రాజేష్,సిరికొండ సాయి, సంపత్ ,ప్రశాంత్, నవీన్, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Monday, 18 September 2017

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరలు : ఎమ్మెల్యే కోవాలక్ష్మి

బతుకమ్మ  పండుగ సందర్భంగా   ఆడపడుచులకు చీరలు : ఎమ్మెల్యే  కోవాలక్ష్మి

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 18 ; ప్రకృతిని పూజించే పండుగ అయిన బతుకమ్మ పండుగను టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి   ఆడపడుచులకు చీరలు పంపిణీని చేసినట్లు   ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి,  ,జిల్లా కలెక్టర్  చంపాలాల్ అన్నారు. సోమవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో భాగంగా కొమురంభీం  ఆసిఫాబాద్ జిల్లాలో చిరలాపంపిణీ ఘనంగా  నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కేంద్రాల్లో మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, గ్రామాల్లో సర్పంచ్ లు చీరల పంపిణీ ప్రారంభించారు.ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట,సందీప్ నగర్ , రాపెల్లి, తుంపల్లి, ఋరుగూడ, ఎల్లారం, అంకుశపూర్ ,రెబ్బెనలలో  ఎం ఎల్ ఏ  పంపిణీని ప్రారంభించారు.   ఈ సందర్భంగా  ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ.. పేదింట పుష్పాల పండుగ .. నిరుపేద కుటుంబాల వారు కూడా ఈ పండుగను అపూర్వంగా జరుపుకుంటారని ,ఉమ్మడి రాష్ట్రంలో మన పండుగలకు తగిన గుర్తింపు ఉండేదికాదని , . . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలకు ప్రాధాన్యం పెరుగుతున్నదాని,  బతుకమ్మ పండుగ ఆడపడుచులకు పెద్ద పండుగ.అని, తెలంగాణ ప్రభుత్వం ముఖ్య మంత్రి కే సి ఆర్ నాయకత్వంలో  అధికారికంగా బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహిస్తున్నదని అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతూ వారి పండుగలను పురస్కరించుకుని నిధులు విడుదల చేసి శభాష్ అనిపించుకుటుందని, ఈ పండుగకు ఆడపడుచులకు కుల,మాత  వైవిధ్యం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికి తలా ఒక చేనేత చీరను పండుగ కానుకగా అందచేస్తున్నామని తెలిపారు. . ఈ కార్యక్రమాలలో ఆసిఫాబాద్  పి  డి  శంకర్,, ఎంపి  డి ఓ  శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ గంధం శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, రెబ్బెనలో జపిటిసీ అజమీర బాబురావు, ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్, సర్పంచులు పెసర, వెంకటమ్మ, గజ్జెల సుశీల, ఉప సర్పంచ్ బి శ్రీధర్ కుమార్, ఎం ఫ టి సి వనజ, పంచాయతీ సెక్రటరీ మురళీధర్, సింగల్ విండో చైర్మన్ మధునయ్య, చిరంజీవే, మడ్డి  శ్రీనివాస్, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. 

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి 
 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 18 ;    సమస్యల పరిష్కారానికి కృషి చేసతమని  ఎంపి పి సంజీవ్ కుమార్ ఏర్పాటు చేసిన  సర్వసభ్య సమావేశం లో అన్నారు.   సోమవారం రెబ్బెనఎంపి  డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సర్వసభ్య సమావేశం లో పలు సమస్యలను సంభందిత  అధికారులతో  చర్చించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామనిఅన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్,జెడ్ పి  టి సీ బాబురావు,తహసీల్దార్ రమేష్ గౌడ్, , ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Sunday, 17 September 2017

విశ్వకర్మ జయంతోత్సవాలు

  విశ్వకర్మ జయంతోత్సవాలు 

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 17 ;      భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి  సందర్భంగా  రెబ్బెన మండలం  గోలేటి టౌన్ షిప్ లో ఆదివారంనాడు  ఘనంగా నిర్వహించారు.   ఈ ఉత్సవానికి మండలంలోని అన్నిప్రాంతాల విశ్వబ్రాహ్మణులు సకుటుంబంగా  పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. . ఉదయం 10 గంటలకు విశ్వకర్మ ధ్వజం వేదోక్తంగా ఆవిష్కరించి,పూజాది  కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో సామూహిక పూజలు నిర్వహించారు.  జిల్లా విశ్వకర్మ కన్వీనర్ పంచలపు లక్ష్మణాచారి పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో. జిల్లా కో కన్వీనర్ ఎం సదాశివాచారి సింగల్ విండో వైస్ చైర్మన్ వెలువోజు వెంకటేశం చారి, , కే రవీంద్రాచారి, వెంకటేశం చారి, శంకర్ చారి, రామయ్య చారి, తదితరులు పాల్గొన్నారు.  

బతుకమ్మచిరల పంపిణి కి సిద్ధం

బతుకమ్మచిరల పంపిణి కి సిద్ధం 



 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 17 ;   బతుకమ్మచిరల పంపిణి కి సిద్ధం గ ఉన్నాయని     రెబ్బెన గ్రామపంచాయతి కార్యదర్శి మురళీధర్ తెలిపారు. సోమవారం పంచాయతి కార్యాలయములో  బతుకమ్మ చీరలు పంపిణి చేయబడునని లబ్ధిదారులు తమ గుర్తింపు కోసం ఆధార్ కార్డు,రేషన్ కార్డు,ఉపాధిహామీ కార్డులతో  పంచాయతీ కార్యాలయంనకు  రావలసి ఉంటుందని  ఒక ప్రకటనలో తెలిపారు. 

తెలంగాణ విమోచ దిన సందర్బంగా జండా ఆవిష్కరణ

తెలంగాణ  విమోచ దిన సందర్బంగా జండా ఆవిష్కరణ 
 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 17 ;   తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను  విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా  చే[పెట్టేవరకు  నిరసన కార్యక్రమాలు చేపడతామని   కొమురం బీమ్  జిల్లా బీజేపీ అధ్యక్షులు   జేపీ పొడేలు అన్నారు ఆదివారం రెబ్బన మండలం లోని గోలేటి బీజేపీ కార్యాలయం లో జెండాను ఎగురవేసారు అలాగే జిల్లాలోని 15 మండలాలలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ విమోచన దినోస్తవాన్ని అఫిఫాబాదు లో బీజేపీ మండల అధ్యక్షుడు ఖండ్రా విశాల్, రెబ్బన మండల అధ్యక్షుడు కుందారపు  బాలకృష్ణ లు  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో కేసరి ఆంజనేయులు  గౌడ్, ,మధుకర్,  కృష్ణ కుమారి, చక్రపాణి, మల్లిక్, శేఖర్, రాజేశ్వర్, సునీల్ చౌదరి,  సాయి, తదితరులు పాల్గొన్నారు.

Saturday, 16 September 2017

ప్రాధమిక స్థాయి ఉపాధ్యాయులకు అభ్యాసన తరగతులు

ప్రాధమిక స్థాయి ఉపాధ్యాయులకు అభ్యాసన తరగతులు 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 16 ;  రెబ్బెన మండలంలోని రిసోర్స్ సెంటర్ లో శనివారం నాడు ప్రాధమిక స్థాయి ఉపాధ్యాయులకు  అభ్యాసన ఫలితాలపై ఒక రోజు శిక్షణ  కార్యక్రమం నిర్వహించడం జరిగిండి. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వేంకటేశ్వరస్వామి, మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన,విద్యనందించాలనే, సరియైన బోధనాభ్యసన ప్రక్రియలను అనుసరించడంద్వారా ఇది సాధ్యమౌతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్ క్షమాలాకర్ ,జునైద్, తూలీసింగ్, లింగయ్య రమేష్,  తదితరులు పాల్గొన్నారు. 

బాల్ బాడ్మింటన్ సబ్ జూనియర్ జట్ల ఎంపిక

 బాల్ బాడ్మింటన్ సబ్  జూనియర్  జట్ల ఎంపిక 
   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 16 ;    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ 15 సబ్   జూనియర్స్  బాల్ బాడ్మింటన్  బాలుర మరియు బాలికల సెలెక్షన్స్ శనివారం నాడు రెబ్బెన మండలం గోలేటి సింగరేణి పాఠశాలలో  జరిగాయి . ఇందులో ఎంపికైనజట్లు 25,26,27 తేదీలలోఖమ్మంలోని కల్లూరులో జరిగే  అంతర జిల్లా బాల్ బాడ్మింటన్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. . ఈ సందర్భంగాడ్ జి ఎం  పర్సనల్ కిరణ్  క్రీడాకారులతో మాట్లాడుతూ  మనజిల్లాలోని క్రీడాకారులుఅంతర   జిల్లా పోటీలలో పతకాలు సాధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో బాల్ బాడ్మింటన్ అసోసియేషన్  జిల్లా కోశాధికారి మహేందర్ రెడ్డి ,పి  ఈ  టి లు రమేష్,భాస్కర్,రాజ్ మహమ్మద్, అనిల్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.  

భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలు


 భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలు 



   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 16 ;  శ్రీ పోతులూరి విరబ్రమేంద్ర  స్వామి  వారి  జయంతి వేడుకలు శనివారం  కాగజ్ నగర్   14వ వార్డ్ లోగల విశ్వకర్మ  దేవాలయం లో  జరిగాయి. శ్రీ విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకల లో డా! కొత్తపల్లి అనిత  శ్రీనివాస్ పాల్గొని పూజలు    ఘనంగా నిర్వహించారు   అనంతరం  డాక్టర్ కొత్తపల్లి అనిత శ్రీనివాస్ ల  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో   మార్కెట్ కమిటీ చెర్మెన్ దంపతులు భక్తులు విశ్వబ్రామ్మన  కమిటీ  ప్రసిడెంట్ గన్నవరం శ్రీనివాస్ కార్యదర్శి ఎర్రోజు రమణ చారి కోశాధికారి గన్నవరం శ్రీధర్ ఆర్గనెజర్ సిరికొండ ప్రవీణ్,కొండపక విద్యాసాగర్, మరియ విశ్వబ్రాహ్మణ,  భక్తులు పాల్గొన్నారు