Wednesday, 26 February 2020

విద్యార్థులకు ఆట వస్తువులు పంపిణీ

 రెబ్బెన‌ ;  రెబ్బెన మండలం లోని ఖైరిగూడా గ్రామపంచాయతీ లో గురువారం మండల ప్రాథమిక పాఠశాల నందు పిల్లలకు కు ఆట వస్తువులను బిజెపి ఆసిఫాబాద్  అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీరా ఆత్మారాం నాయక్ పంపిణీ చేశారు.  వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పల్లెల్లో ఉన్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలలొ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారి  మానసిక ఎదుగుదలకు ఆటలు ఎంతో సాయపడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ పంచాయతీ సెక్రెటరీ వినోద్ గ్రామ పెద్దలు వస్త్రం నాయక్ హరి నాయక్ గణేష్ చిలుముల శంకరి వసంతరావు పాల్గొన్నారు.

No comments:

Post a Comment