Wednesday, 26 February 2020

కార్మికుల హక్కుల సాధన టీబీజీకేఎస్ తోనే సాధ్యం ; బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు

రెబ్బెన : కార్మికుల హక్కులు సాధించాలన్నా ఇతర సౌకర్యాలు కల్పించాలని అది కేవలం టీబీజీకేఎస్ తోనే సాధ్యమని  టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస రావు అన్నారు. శనివారం గోలేటి సి హెచ్ పి లో ఏర్పాటుచేసిన ద్వారా సమావేశంలో మాట్లాడుతూ  కార్మికులకు ఎనలేని హక్కుల సాధించిన ఘనత కోల్ ఇండియాలో లేనివిధంగా సింగరేణిలో ఎన్నికలకు ఇచ్చిన ఘనత కెసిఆర్ మరియు టీబీజీకేఎస్ అని అన్నారు.   క్షేత్రస్థాయిలో కార్మికులకు రావలసిన ఎన్నో హక్కులను సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తుంది టీబీజీకేఎస్ కావున కార్మిక సోదరులు అందరూ గమనించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి మద్దతు తెలపాలని కోరారు.  తండ్రి కొడుకుల ఉద్యోగం 10 లక్షల గృహ రుణ వడ్డీ మాఫీ ఏసీల ఏర్పాటుకు అనుమతి ఉచిత కరెంటు తెలంగాణ ఇంక్రిమెంటు మెటర్నిటీ లీవ్ మూడు నెలల నుంచి ఆరు నెలలకు పెంచుట చైల్డ్ కేర్ లీవ్ రెండు సంవత్సరాల పాటు కల్పించుట PME  కి వెళితే ఆన్ డ్యూటీ కల్పించడం లాంటి ఎన్నో హక్కుల సాధించిన ఘనత 365 మంది కార్మికులకు త్వరలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా క్వాలిటీ డిపార్ట్మెంట్ ను సి హెచ్ పి లో విలీనం చేయడానికి కృషి చేసి వారికి ఎన్నో హక్కులు వచ్చే విధంగా పోరాటం చేసిన సాధించిన శ్రీనివాసరావుకు క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సి హెచ్ పి ఇంచార్జి కార్యదర్శి రమేష్ సెంట్రల్ కమిటీ మెంబర్ రాజన్న జిఎం కమిటీ మెంబర్ సమ్మయ్య ,సంపత్, అసిస్టెంట్ కార్యదర్శి సదానందం మరియు మైన్స్ కమిటీ మెంబర్లు మరి సమ్మయ్య రవికుమార్ ఆర్ కె రాములు సమీ శ్రీనివాస్ అమర్సింగ్ సత్యనారాయణ విజయ రమేష్, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు ఆర్ శ్రీనివాస్ జి రాజేష్ గోలేటి కార్యాలయ కార్యదర్శి వంగ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment