రెబ్బెన : చత్రపతి శివాజీ 390 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెబ్బెన మండలంలో పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. రెబ్బెన, నక్కల గూడ, కొండపల్లి, వనుకులం, నవగం, లక్ష్మీపూర్, గగాపూర్, నంబల గోలేటి వివిధ గ్రామాలలో మరాఠా యోధుడు ఈ సందర్భంగా గ్రామంలో జెండా గద్దె ఏర్పాటు చేసి చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జెండాను ఎగరవేశారు. గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ చత్రపతి శివాజీ యుద్ధ తంత్రాలు లోనే కాకుండా పరిపాలనా విధానంలో కూడా భారతదేశంలో అగ్రగణ్యుడు అని తెలియజేశారు ప్రజలకోసమే ప్రభువు అనే సిద్ధాంతాన్ని నమ్మి ప్రజల సంక్షేమం సంక్షేమం కోసం పాటు పడ్డారు మహిళలను పసివాళ్లను గౌరవించే వాడు శివాజీ అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్యామ్ రావు, శ్రీనివాస్, లలిత, మాధవి నక్కలగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, గ్రామ పెద్దలు దుర్గాదాస్ నాగయ్య ఏ మాజీ హోసన్నా బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment