రెబ్బెన : మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నక్కల కూడా ప్రాథమిక పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ అన్నారు గురువారం జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలం లోని నక్కల కూడా ప్రాథమిక పాఠశాల లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమ పోరాటం లో మహాత్మా గాంధీ కీలక పాత్ర అని సత్యం మరియు అహింసను ఆయుధాలుగా బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ భీమ్రావు, గ్రామస్తులు శ్యామ్ రావు, విలాస్, హనుమంతు, పెంటయ్య ,అనిల్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment