రెబ్బెన : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం రెబ్బెన లో దుర్గం తిరుపతి స్మారక క్రికెట్ పోటీలను క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో యువకులు క్రీడలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఎవరైనా గెలిచినా ఓడినా స్నేహభావంతో ఉండాలని అన్నారు గ్రామాల్లో ఉన్న క్రీడాకారులకు తనవంతు సాయం ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య ఆనంద్, జడ్పీటీసీ సంతోష్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, సర్పంచ్ ఆహల్యాదేవి. సోమశేఖర్, ఎంపీటీసీ మధునయ్య, చారి,trs కార్యకర్తలు, పాల్గొన్నారు.
No comments:
Post a Comment